మొదలైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందడి.. టీమ్‌ల విశేషాలు ఇవే..!

స్పోర్ట్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్నవారు ఆడేదే ఈ స్పోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్ లీగ్ అని చెప్పవచ్చు. ఈసారి సీజన్‌లో ముంబై హీరోస్‌, చెన్నై రైనోస్‌, తెలుగు వారియర్స్‌, భోజ్‌పురి దబాంగ్స్, కేరళ స్ట్రైకర్స్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ దే షేర్ అనే 8 ప్రాంతాల జట్లు ఆడనున్నాయి. ఇక రాయ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్, జోధ్‌పూర్, త్రివేండ్రం, జైపూర్ వంటి ఆరు నగరాలు 19 గేమ్‌లకు వేదిక కానున్నాయి.

ముంబై హీరోస్‌కి రితేష్‌ దేశ్‌ముఖ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీనికి సల్మాన్‌ ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఇక చెన్నై రైనోస్‌కి ఆర్య కెప్టెన్‌గా ఉన్నాడు. అక్కినేని అఖిల్‌ తెలుగు వారియర్స్‌కి సారథ్యం వహిస్తున్నాడు. దీనికి వెంకటేష్‌ కో-ఓనర్‌గా ఉన్నాడు. ఇక భోజ్‌పురి దబాంగ్స్ టీమ్‌కి మనోజ్‌ తివారీ కెప్టెన్‌గా ఉంటే.. మోహన్ లాల్ కో ఓనర్ గా కొనసాగుతున్నాడు. ఇకపోతే కేరళ స్ట్రైకర్స్ కి కుంచాకో బోపన్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. బోనీ కపూర్‌తో ఓనర్‌గా జిసుసేన్ గుప్తా కెప్టన్ గా బెంగాల్ టైగర్స్ ఈసారి బరిలోకి దిగనుంది. కిచ్చా సుదీప్‌ నాయకత్వంలో కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ మ్యాచ్‌లు ఆడనుంది. సోనూసూద్‌ పంజాబ్ దే షేర్ టీమ్‌ను ముందుండి నడిపించనన్నాడు.

CCL లీగ్‌లో 120 మందికి పైగా సినిమా వారు క్రికెట్ ఆడనున్నారు. ఫేవరెట్ హీరోలు అందరూ ఇందులో ఆడతారు కాబట్టి దీనిని చూడటం వల్ల ప్రేక్షకులకు బీభత్సమైన వినోదం దొరుకుతుందని చెప్పవచ్చు. గత సీజన్లలో బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి స్టేడియాలు ఈ మ్యాచ్‌లకు వేదికయ్యాయి. వాటన్నిటికి పూర్తిస్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఈసారి మిగతా లొకేషన్‌లలో కూడా మ్యాచ్‌లు జరుగుతాయి కాబట్టి మరింత మంది ప్రజలు లైవ్ చూసే అవకాశం ఉంటుంది. అలానే ఇంట్లో ఉండేవారు 7 జీ టీవీ నెట్‌వర్క్‌లలో మ్యాచ్‌లు లైవ్ చూడవచ్చు.