అభిమానులకు ఎన్టీఆర్ బిగ్ సర్ ప్రైజ్.. గెట్ రెడీ రా అబ్బాయిలు..మీసం తిప్పాల్సిందే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక అలవాటుగా మారిపోయింది. గతంలో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలను మళ్లీ 4కే ప్రింట్ తో గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ చేసి అభిమానులకి కొత్త లుక్ ను ఇస్తున్నారు స్టార్ హీరోలు . ఈ క్రమంలోని ఇప్పటికే ప్రభాస్ – పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు తాము నటించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాలను రిలీజ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను మరోసారి తమ ఖాతాలో వేసుకున్నారు .

కాగా ఎన్టీఆర్ కూడా అదే లిస్టులోకి జాయిన్ అయిపోయాడు. కాగా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా పేరు సంపాదించుకున్న సినిమాను మళ్ళీ 4క్ వర్షెన్ లో రిలీజ్ చేయబోతున్నారు . జూనియర్ ఎన్టీఆర్ -నయనతార -షీల జంటగా వి వి వినాయకక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను మార్చి 4 న ఫోర్ కె ప్రింట్ తో రీ రిలీజ్ చేయడానికి Makers సర్వం సిద్ధం చేసుకున్నారు.

రీ రిలీజ్ కి సంబంధించిన పనులు కూడా పూర్తి చేసుకున్నారు . మార్చి ఫస్ట్ వీక్ లో సినిమా రిలీజ్ చేయాలని టీం భావిస్తుందట . ఈ వీక్ లో పెద్ద సినిమాలేవి రిలీజ్ కి సిద్ధంగా లేకపోవడంతో అదుర్స్ సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ పరంగా మరింత పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయని ఇలా చేస్తున్నారట . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు . మాస్ లుక్ లో ఎంతసేపు ఎన్టీఆర్ ని చూసి చూసి బోర్ కొట్టేసిందని ..మళ్లీ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ మీసం మెలేసి మరి ఈ న్యూస్ ని షేర్ చేస్తున్నారు . దీంతో నందమూరి అభిమానుల ముఖాలు కలకల్లాడిపోతున్నాయి..!!