సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా.. సంయుక్త మీన‌న్‌ ఇంత షాకిచ్చిందేంటి?

సంయుక్త మీన‌న్‌.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పాప్‌కార్న్` అనే మ‌ల‌యాళ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. త‌ర్వాత వ‌ర‌స‌గా అక్క‌డ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. `భీమ్లా నాయక్` మూవీతో టాలీవుడ్ ప‌రిచ‌య‌మైన సంయుక్త‌.. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది.

ఆ త‌ర్వాత సంయుక్త న‌టించిన `బింబిసార‌` సైతం మంచి విజ‌యం సాధించ‌డంతో.. ఈ ముద్దుగుమ్మ‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం సంయుక్త `సార్‌` మూవీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ తెలుగులో డైరెక్ట్‌గా చేస్తున్న తొలి చిత్ర‌మిది. తెలుగులో ‘సార్‌’, తమిళంలో ‘వాతి’ టైటిల్స్ తో ఫిబ్ర‌వ‌రి 17న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు.

అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సంయుక్త‌.. తాను సినిమాలు వదిలేయాలనుకునే విషయాన్ని వెల్ల‌డించి షాకిచ్చింది. `కేరళలోని ఓ పల్లెటూళ్లో పుట్టిన నేను సినిమాల్లోకి వస్తానని హీరోయిన్ గా రాణిస్తానని ఊహించలేదు. కెరీర్ ఆరంభంలో ఓ మంచి సినిమాలో నటించి ఆ తరువాత న‌ట‌న‌కు గుడ్ బై చెప్పాలనుకున్నా. అయితే నేనొకటి తలిస్తే విధి మరోటి తలిచింది. దాంతో నేను హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలోనే ఉండిపోయా. ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్న నేను ఆ తరువాత సినిమాతోనే ప్రేమలో పడిపోయా` అని సంయుక్త చెప్పుకొచ్చింది.