బ్లాస్టింగ్ అప్డేట్: మహేశ్ కోసం కత్తి లాంటి ఫిగర్ ని పట్టిన రాజమౌళి.. పర్ఫెక్ట్ మ్యాచ్ ..!!

ప్రజెంట్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 29 . మహేష్ బాబు ఫస్ట్ టైం రాజమౌళితో చేయబోతున్న సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ..? అంటూ ఫ్యాన్స్ కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా సర్కారీ వారి పాట సినిమా హిట్ అయిన తర్వాత మహేష్ – రాజమౌళి కాంబోలో సినిమా వస్తుందని తెలుసుకున్న అభిమానులు.. ఓ రేంజ్ లో ఈ సినిమా కోసం తహతహలాడిపోతున్నారు . ప్రెసెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ విషయంలో ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించని ఘట్టమనేని ఫ్యాన్స్ ..మహేష్ – రాజమౌళి సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సినిమాలో హీరోయిన్గా రకరకాల ముద్దుగుమ్మల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఫైనల్గా రాజమౌళి – మహేష్ బాబు పక్కన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే ను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది . ఇప్పటికే అమ్మడు దగ్గర నుంచి కాల్ షీట్స్ కు సంబంధించిన సిగ్నేచర్ కూడా తీసుకునేసారట .

అంతేకాదు ఈ సినిమాలో అందాల ఐశ్వర్యరాయ్ లేడీ విలన్ రోల్ లో మెప్పించబోతుంది. దీంతో సినిమాలో ఇంత పెద్ద కాస్ట్ అండ్ క్రూ ఉండడంతో మహేష్ బాబు అభిమానులు మరింత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . అంతేకాదు పటాన్ సినిమా 850 కోట్లు క్రాస్ చేయడంతో దీపికా పదుకొనే పై మరింతగా ఫోకస్ చేస్తున్నారు జనాలు. పటాన్ సినిమా హిట్ అవ్వడానికి షారుక్ ఖాన్ ఎంత కారణమో దీపికా అందాలు అంతే కారణమన్నా సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ తో ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!