హీరోయిన్ సౌందర్యకి ఉన్న ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే అవాక్కవుతారు..

సహజనటిగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన దివంగత నటి సౌందర్య. కన్నడ ఇండస్ట్రీకి చెందిన సౌందర్య గురించి చాలామందికి తెలిసి ఉంటుంది కానీ ఈమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం కచ్చితంగా చాలా తక్కువ మందికి తెలిసే ఉంటుంది. నిజానికి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఏం లేకుండా సౌందర్య సినిమా ఇండస్ట్రీలో అడిగి పెట్టిందని చాలామంది అనుకుంటారు కానీ అది నిజం కాదు. సౌందర్య తండ్రి సత్యనారాయణ ప్రముఖ సినీ రచయిత. కొన్ని కన్నడ సినిమాలను ప్రొడ్యూస్ కూడా చేశాడు.

సత్యనారాయణకి జ్యోతిష్యంలో కూడా మంచి పట్టు ఉండటంతో తన కూతురు సౌందర్య గురించి ఆయన ముందే జ్యోతిష్యం రాశారు. యుక్త వయసులోనే ఆమె కన్నుమూస్తుందని.. అప్పటికే చలనచిత్ర రంగంలో గొప్ప హీరోయిన్‌గా ఎదుగుతుందని ఆయన ఆమె జాతకం రాశారట. సత్యనారాయణ రాసినట్టుగానే హీరోయిన్ సౌందర్య 31 ఏళ్ల వయసులో హెలికాప్టర్ ప్రమాదంలో సజీవ దహనం అయింది. అప్పటికి సౌందర్య ఐదు నెలల గర్భంతో ఉండటం మరో విషాదకరమైన నిజం అని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా, సౌందర్య మరణించక ముందే తన తండ్రి సత్యనారాయణ కన్నుమూసారు. దాంతో సౌందర్య తన తండ్రి జ్ఞాపకార్థం 1999లో ఒక సినిమా తీయాలని నిర్ణయించుకుంది. ఆమె ఆ సినిమాను నిర్మించింది. అంతేకాదు, టైటిల్ రోల్ లో నటించి మెప్పించింది. 2002లో రిలీజ్ అయిన ఆ సినిమా పేరు ద్వీప. కన్నడ భాషా చిత్రమైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీనికి జాతీయ, ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి.

సౌందర్యకు తన తండ్రి అంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టం. నిజానికి ఆమె ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి తన తండ్రి పాత్ర ఎంతో ఉంది. తన సక్సెస్‌లో తన తండ్రి చాలా కీలకమని కూడా సౌందర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.