యర్రగొండపాలెంలో తమ్ముళ్ళ రచ్చ.. మళ్ళీ టీడీపీకి దక్కేది లేదా?

తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం పట్టు లేని స్థానాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం కూడా ఒకటి. 2008లో ఏర్పడిన ఈ స్థానంలో టీడీపీ ఇంతవరకు గెలవలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది..ఇక అక్కడ పరిస్తితులు చూస్తుంటే మరోసారి కూడా టీడీపీ ఓడిపోయేలా ఉందని చర్చ నడుస్తోంది. 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆదిమూలపు సురేశ్ గెలిచారు. టీడీపీ తరుపున డేవిడ్ రాజు ఓటమి పాలయ్యారు.

ఇక 2014 ఎన్నికల్లో డేవిడ్ టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేసి గెలిచారు. అటు టీడీపీ నుంచి అజితా రావు పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక డేవిడ్ మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆదిమూలపు సురేశ్ గెలిచారు. టీడీపీ నుంచి అజితా రావు పోటీ చేసి ఓడిపోయారు. ఇక డేవిడ్ మళ్ళీ వైసీపీలోకి వెళ్లారు. అయితే ఇక్కడ వైసీపీలో సురేశ్ హవా నడుస్తోంది. మళ్ళీ ఆయనకే సీటు దక్కనుంది..అలాగే ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారు.

కానీ టీడీపీలో సీటు కోసం పెద్ద రచ్చ జరుగుతుంది. అజితా రావుని పక్కన పెట్టి ఎరిక్షన్ బాబుని ఇంచార్జ్ గా పెట్టారు. అయినా టీడీపీ బాగుపడలేదు. ఓ వైపు అజితా రావు వర్గం, మరోవైపు ఎరిక్షన్ వర్గం..ఇలా సెపరేట్ గా విడిపోయి ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. మధ్యలో డాక్టర్ రవీంద్ర వర్గం…ఇలా యర్రగొండపాలెంలో టీడీపీ గ్రూపులుగా విడిపోయింది. అటు మాజీ ఎమ్మెల్యే డేవిడ్ మళ్ళీ టీడీపీలోకి వస్తానని సీటు ఇవ్వాలని అంటున్నారు.

దీంతో యర్రగొండపాలెం సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు..ఇక ఎవరికి దకిన మరొక వర్గం సహకరించే పరిస్తితి లేదు. దీని బట్టి చూస్తే యర్రగొండపాలెం మళ్ళీ టీడీపీకి దక్కేలా లేదు.