పఠాన్ ఓటీటి సినిమా రిలీజ్ డేట్ లాక్..!!.

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా పఠాన్. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో షారుక్ , దీపిక పడుకొనే నటిస్తోంది. ఈ సినిమాకి సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ పాత్ర పఠాన్ అనే రా ఏజెంట్గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.. అంతేకాకుండా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ,హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రానికి విశాల్ మరియు శేఖర్ సంగీతం అందించారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ పాటలు సంచలనం సృష్టించాయి.

Pathaan Movie OTT Release Date - Digital Rights | Watch Online - OTT Raja

అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ సినిమా జనవరి 26న రిలీజ్ కానుండగా.. ఏప్రిల్ 26న ఓటీటి లో విడుదల కాబోతోందని సమాచారం. సినిమా రిలీజ్ కాకానే ఓటిటి డేట్స్ ఇది అంటూ నెట్టింట్లో ఓ వార్త వైరల్ గా మారుతోంది. అయితే ఈ విషయాన్ని పఠాన్ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన కేసు విషయంపై పఠాన్ మేకర్స్ కోర్టులో ఈ తేదీని వెల్లడించారని రూమర్స్ అయితే ఉంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ రూ.100 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు సమాచారం.

బాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాది భాషలలో విడుదల కానుంది.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ మార్చి 25న 2023 నుంచి అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంటుందన్న సమాచారం. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి ఓటీటి రైట్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ సినిమా ఓటీటి లో ఏప్రిల్ 26న పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. సైఫ్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం కీలకపాత్రలో కనిపించారు.