వర్మ చూపు శ్రీదేవి పై.. డాన్స్ మాస్టర్ చూపు వెంకటేష్ పై.. ఈ సంఘటన తెలిస్తే మతులు పోవాల్సిందే..!

సంచనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆయన ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఆయన తొలి సినిమా ‘శివ’ తోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. ఆర్జీవి తన గురించి రాసుకున్న ‘నా ఇష్టం’ పుస్తకంలో ఆయనలోని భావవాలను పంచుకున్నాడు. రామ్ గోపాల్ వర్మకు చిన్నతనం నుంచి శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం తను సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం శ్రీదేవి అని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు.

ఆయన వెంకటేష్ తో ‘క్షణం క్షణం’ సినిమా.. రాంగోపాల్ వర్మ- శ్రీదేవికి రాసుకున్న ప్రేమలేఖ అని ఆయన రాసిన పుస్తకంలో ఆయన రాసుకున్నారు. తనకు ఇష్టమైన నటిని ఇంప్రెస్ చేయడానికి ఒక్కసారైనా తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలని తపించేవాడు. తను దర్శకుడు అయ్యాక శ్రీదేవి సినిమాలో నటించేటప్పుడు కన్నా మామూలు సమయంలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కూడా వర్మ ఎంతో ఆత్రుతగా ఉండేవాడు. ఆమె ఎప్పుడూ తన చుట్టూ ఒక గోడ కట్టుకుని ఆ ప్రపంచంలోనే ఉంటూ ఎవరిని తన ద‌గ్గ‌ర‌లోకి రానిచ్చేది కాదు. అందుకే నేమో వర్మకు శ్రీదేవి పై మరింత ఇష్టం పెరిగింది.

సినిమా మొదలయ్యాక అరగంట వరకు హీరో ఎంట్రీ ఇవ్వకుండా హిట్ అయినా సినిమా ఇదే | Kshanam  Kshanam Movie Untold Facts , Kshanam Kshanam , Venkatesh, Sridevi,Director  Varma,Villain Gang,ram Gopal Varma ...

ఇక రాంగోపాల్ వర్మ వెంకటేష్ తో ‘క్షణం క్షణం’ సినిమా షూటింగ్ సమయంలో ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. షూటింగ్ స్పాట్‌లో శ్రీదేవి ఉన్నప్పుడు పక్కన ఎవరు ఉన్న ఏం జరిగినా వర్మకు పట్టేది కాదు. ఆ సినిమాలో ”అందనంత ఎత్త తార తీరం”.. అనే సాంగ్ షూటింగ్ జరిగే సమయంలో ఈ సాంగ్ కు డాన్స్‌ మాస్టర్ గా సుందరం మాస్టర్ చేశారు.. వెంకటేష్- శ్రీదేవి డాన్స్ చేస్తున్న సమయంలో ఒక షార్ట్ అయిపోగానే వర్మ సూపర్ ఫెంటాస్టిక్ అని చెప్పేవారు.

Ram Gopal Varma remembers the late Sridevi | Filmfare.com

కానీ సుందరం మాస్టర్ మాత్రం ఇంకోటేక్ చేద్దామని అనేవారు.. ఆ టేక్ కంఫ్లీట్‌ అయిన వెంటనే వర్మ మళ్ళీ సూపర్ సూపర్ అంటూ అరిచేవాడు. కానీ సుందరం మాస్టర్ మళ్ళీ రీటెక్ అనేవాడు.
ఆ షార్ట్ ఎంత బాగా వచ్చినా డాన్స్ మాస్టర్ మళ్ళీ ఎందుకు తీయాలి అంటున్నాడు వర్మకు అర్థమయ్యేది కాదు. ఆ సమయంలోనే వర్మ‌ అసిస్టెంట్ ఒకడు వచ్చి సార్ మీరు శ్రీదేవిని చూస్తుంటే సుందరం మాస్టర్ వెంకటేష్ ని చూస్తున్నారని చెప్పాడు.

అంటే శ్రీదేవి షూటింగ్ స్పాట్‌లో ఉంటే పక్కన ఎంత పెద్ద హీరో ఉన్నప్పటికీ వర్మ కళ్ళు మాత్రం శ్రీదేవి పైన మాత్రమే ఉంటాయి. ఈ సినిమా విడుదల అయ్యాక వర్మ మాత్రమే కాకుండా ప్రతి సిని అభిమానుల కళ్ళు కూడా శ్రీదేవి పైనే పడ్డాయి. ఈ సినిమాలోని పాటలు కూడా అందమైన లోకేషన్ లో తీయాలనుకున్నారు కానీ శ్రీదేవి కనిపిస్తుంటే ఆ లొకేషను ఎవరూ చూడరని వర్మ అన్నాడు.