స్టార్ హీరో ఇంటికి మరో స్టార్ హీరో అద్దెకు వస్తున్నాడు.. రేట్‌ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం షెహజాదా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అలా వైకుంఠపురములో సినిమాకు రీమేక్ గా అక్కడ తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటే కార్తీక్.. బాలీవుడ్ మరో హీరో షాహిద్ కపూర్ ఇంటిలో అద్దకు ఉండబోతున్నాడు.

Kartik Aaryan, Kriti Sanon's Shehzada trailer launch to be 3 day...

ముంబైలోని జుహులో షాహిద్ కపూర్ కు ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. గత సంవత్సరం వరకు షాహిద్ తన భార్య తన పిల్లలతో కలిసి అక్కడే ఉండేవాడు. రీసెంట్ గానే వీరు వర్లీలోని డూప్లెక్స్ ఇంటికి మారిపోయారు. దీంతో తను ఇదివరకు ఉన్న అపార్ట్‌మెంట్ ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఇప్పుడు తాజాగా ఈ అపార్ట్‌మెంట్ కి కార్తీక్ ఆర్యన్ అద్దెకు వస్తున్నట్లు తేలుస్తుంది.

ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దె కూడా రూ.7.5 లక్షలు కాగా ప్రతి సంవత్సరం రెంట్ పెరుగుతుందట. రెండో సంవత్సరం నెలకు రూ.8.02 చెల్లించాల్సి ఉంటుందట. మూడో సంవత్సరం దీనికి డబుల్ అవుతుందట. ఈ ఇంట్లోకి రెంట్‌కు వచ్చేందుకు సెక్యూరిటీ డిపాజిట్ గా ముందుగా రూ.45 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

Kartik Aaryan Gets Trolled For His Fake Abs In An Ad | MissMalini

ఈ రిజిస్ట్రేషన్ పనులు కూడా సంక్రాంతికి ముందుగానే పూర్తయినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. కార్తీక్ ఆర్యన్ ఇంతటి భారీ రెంట్‌ కలిగిన ఇంట్లో అద్దెకు ఉండబోతున్నాడు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అయినా ఈ హీరో దశ తిరుగుతుందా లేదో చూడాలి.