రాజమౌళిని రిజెక్ట్ చేసిన స్టార్స్ వీళ్లే..!!

.. ఇక తనతో సినిమా చేసేందుకు అవకాశం వస్తే ఏ హీరో కూడా వదులుకోరు. వెంటనే ఓకే చెప్పేస్తూ ఉంటారు. అయితే రాజమౌళి కావాలనే కొందరి నటులను తమ సినిమాలో నటించాలని అడిగినప్పుడు కొంతమంది వివిధ కారణాల చేత రాజమౌళి దర్శకత్వంలో నటించానని తెలియజేసినట్లు సమాచారం. ఆ హీరోలు ఎవరు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

SS Rajamouli reacts to old remark on Hrithik being 'nothing in front of Prabhas' | Bollywood - Hindustan Times

రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.. ఇక అలాగే వీరి కాంబినేషన్లో సింహాద్రి, యమదొంగ సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. అయితే మొదట సింహాద్రి సినిమాని ప్రభాస్ తో చేయాలనుకున్నారట రాజమౌళి.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా అంతగా నచ్చకపోవడంతో సింహాద్రి సినిమాని ప్రభాస్ వదులుకున్నారట. దీంతో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ కి అవకాశం ఇచ్చారు రాజమౌళి. ఇక తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ వైడ్ గా తీసుకువెళ్లిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించగా..

ఆమె భారీగా రెమ్యూనరేషన్ అడగడంతో రమ్యకృష్ణ అని తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇదే సినిమాలో బల్లాలదేవ్ నెగటివ్ క్యారెక్టర్ లో వివేక్ ఒబేరామ్ అడగగా అయితే అప్పటికే బిజీగా ఉండడం చేత నో చెప్పారట. అలా ఆ పాత్ర రానాకి దక్కింది. అలాగే అవంతిక పాత్రకు సోనం కపూర్ ని అడగగా ఏవో కారణాల చేత వదులుకుంది. దీంతో తమన్నా ఈ చిత్రంలో నటించింది.