మోసం చేసిన మంచు మ‌నోజ్‌.. తుస్సుమ‌న్న స‌ర్‌ప్రైజ్‌!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నాడని గత కొద్ది నెలల నుంచి నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పలుమార్లు వీరిద్దరూ జంటగా కనిపించారు. అలాగే ఇటీవలే కడప దర్గాకు వెళ్లిన మనోజ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తాను కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని, ఈసారి కుటుంబంతో కలిసి ఇక్కడకు వస్తానని వ్యాఖ్యానించారు.

దీంతో మనోజ్-మౌనికరెడ్డి వివాహం ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. ఇలాంటి త‌రుణంలో మ‌నోజ్ `ముహూర్తం కుదిరింది.. ఈ నెల 20న స‌ర్‌ప్రైజింగ్ న్యూస్ చెప్ప‌బోతున్నా` అంటూ ట్వీట్ చేశాడు. అయితే అది పెళ్లి వార్తే అని అంద‌రూ భావించారు. కానీ, మ‌నోజ్ అంద‌రినీ మోసం చేశాడు. ఎందుకంటే, అది పెళ్లి వార్త కాదు.. ఆయ‌న కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌.

`వాట్ ది ఫిష్` అనే టైటిల్ తో మ‌నోజ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఓ మేర‌కు తాజాగా ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. డెబ్యూ డైరెక్టర్ వరుణ్ కోరుకొండ వాట్ ది ఫిష్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సిక్స్ సినిమాస్, ఏ ఫిల్మ్ బై బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. డార్క్ కామెడీ, థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వాట్ ది ఫిష్ తెరకెక్కుతోందని సమాచారం. అయితే మ‌నోజ్ ఇచ్చిన ఈ స‌ర్‌ప్రైజ్ తుస్సుమంది. `పెళ్లి న్యూస్ కాదా.. సినిమా అనౌన్స్‌మెంటా..?` అంటూ నెటిజ‌న్లు మ‌నోజ్ ప్ర‌క‌ట‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

https://twitter.com/HeroManoj1/status/1616288308874838016?s=20&t=nIXr8UcbY_QO7KUCJq-5Rw