బాలయ్య మీద పడి ఏడ్చే ప్రతి మెగా ఫ్యాన్ కుళ్లుకునే న్యూస్..నందమూరి అభిమానులు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు గా..!

చిత్ర పరిశ్రమంలో ఎందరో హీరోలు ఉంటారు కానీ అందరూ రియల్ హీరోలు అవ్వరు. కేవలం వారందరూ తెరపై మాత్రమే హీరోలు. కానీ కొందరు మాత్రం సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లోను రియల్ హీరోలు గానే ఉంటారు. వారు రియల్ హీరోలని బయటికి చెప్పుకోరు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎవరికీ తెలియనివ్వరు అలాంటి వాళ్లలో ఒకరు నందమూరి బాలకృష్ణ.

ఆయన తన తల్లి గారి పేరుతో స్థాపించిన బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో ఎందరో నిరుపేదలకు ఉచితంగా క్యాన్సర్ వైద్యం చేస్తున్నారు. రీసెంట్‌గా క్యాన్సర్ కి గురైన ఒక అమ్మాయికి తన సొంత డబ్బుతో వైద్యం చేయించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన అన్ స్టాపబుల్ షోలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

Balakrishna compassion for cancer patients, smile on Swapna face

ఇక ఆ షోలోనే ఆ అమ్మాయి స్టేజ్ పైకి వచ్చి బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపింది. చాలా మంది బాలకృష్ణ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు.కానీ బాలకృష్ణ అలా కాదు అది ఆయనలోని ఒక కోణం మాత్రమే.. ఆయన ఆపదలో ఎవరు ఉన్న నిమిషాల్లో వారికి సహాయం చేస్తారు. వాళ్లకు ఆర్థికంగా అండగా ఉంటారు.

Balakrishna to launch NTR Arogya Ratham to provide medical services in  Hindupur

ఇలాంటి సంఘటనలు ఆయన జీవితంలో ఎన్నో జరిగాయి. ఇదే క్రమంలో ఇటీవల ఓ యువతకి బోన్ క్యాన్సర్ రావడంతో ట్రీట్ మెంట్ కోసం రూ.10 లక్షలు వెంటనే సాయంగా ఇచ్చేశారు. ఎప్పుడూ బాలయ్య మీద పడి ఏడ్చే మెగా ఫ్యాన్స్ కు కళ్ళు తెరిపించేలా నందమూరి అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా బాలయ్య గ్రేట్ అంటూ పొగడ్తల వర్షంతో ముంచెత్తారు.