భానుమతి జీవితంలో ఇన్ని విషాద ఛాయలా.. కన్నీళ్ళాగవు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ మరుపురాని పేర్లలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ భానుమతి కూడా ఒకరు. ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలు సైతం ఈమెకు పూర్తిస్థాయిలో గౌరవాన్ని అందించేవారు. ముఖ్యంగా హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన భానుమతి గురించి.. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ లాంటి గొప్ప నటులు కూడా.. ఆమెను గౌరవించాల్సిందే. కాళ్లకు నమస్కారం చేయాల్సిందే.. అని బాలయ్యతో అన్నారు అంటే ఆమె స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మంగమ్మగారి మనవడు సినిమా షూటింగ్ సమయంలో ప్రతిరోజు షూటింగ్ స్పాట్ కి భానుమతి వచ్చిన ప్రతిసారి.. ఆమె కంటే ముందే ఆమె కారు దగ్గరకు బాలకృష్ణ వెళ్లి కారు డోరు తీసి.. ఆ తర్వాత ఆమె కాళ్ళకు పాదాభివందనం చేసేవాడు. అలా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు బాలకృష్ణ రోజు దినచర్యలో భాగంగా ఇలా భానుమతికి పాదాభివందనం చేసేవారు.

అలా ఈ నటి జీవితం చివరి దశలో ఎన్నో కష్టాలు పడ్డారని కూడా తెలిపారు కాంట్రాగడ్డ మురారి . ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు . భానుమతి అంటే ఆమె ఒక దేవత. నెత్తి మీద పెట్టుకొని పూజ చేయవచ్చు. అంతలా కీర్తించిన ఆవిడకు శాపం తగిలినట్టుగా చివరి రోజులు సరిగా జరగలేదని కాంట్రాగడ్డ మురారి ఆవేదన వ్యక్తం చేశారు. థైరాయిడ్ సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె చివరికి బరువు కూడా భారీగా పెరిగిపోయారు. కొడుకు, మనవళ్ళు అమెరికాలోనే ఉండడంతో ఆమె ఇండియాలో ఒంటరిగా ఉండేవాళ్ళు.

ఇల్లు చాలా పెద్దది.. ఇంటి నిండా ఏసీలు కూడా ఉండేవి. అయితే ఒక్క ఏసీ కూడా వేసుకోలేకపోయారని తెలిపారు మురారి .. నటిగా , నిర్మాతగా , దర్శకురాలిగా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన ఈమె భర్త రామకృష్ణ వున్నప్పుడు చాలా సంతోషంగా జీవితాన్ని గడిపిందట. ఆయన మరణించిన తర్వాత వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని కాంట్రాగడ్డ మురారి చెప్పుకొచ్చారు.