అనసూయ గురించి ఈ సీక్రెట్స్‌ తెలిస్తే నోరెళ్లబెడతారు..

బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్న యాంకర్ అనసూయ. యాంకరింగ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది. న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పరిచయమైన అనసూయ జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పి సినిమాలోకి అడుగుపెట్టింది. బుల్లితెరకు గుడ్‌బై చెప్పిన అనసూయ గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అనసూయ 1985 మే 5న హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తండ్రి పేరు సుదర్శన రావు. అయితే అనసూయ, భరధ్వాజను పెళ్లి చేసుకోవడానికి తన తండ్రిని ఒప్పించడానికి దాదాపు 9 ఏళ్లు ఎదురు చూసింది. అనసూయ హైదరాబాద్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే సమయంలోనే ఆమెకి మీడియా లో పనిచేయాలనే కోరిక ఉండేదట. అనసూయ మొదటిగా వెండితెరపై జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాగ’ అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో నటించినందుకు ఆమె రూ. 500 పారితోషికం తీసుకుందట. అదే ఆమె మొదటి సంపాదన.

దాని తరువాత సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా పనిచేసింది. ఇక అప్పటినుంచి అనసూయకి ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలయింది. దాని తరువాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్‌గా మారింది. ఈ షో మంచి హిట్ సాధించడంతో అనసూయ పేరు కూడా మారుమ్రోగిపోయింది. ఇక ఆ తరువాత నుంచి ఒక ఈ టీవీలోనే కాకుండా మాటీవీ, జీటీవీ ఇలా అన్ని ఛానెల్స్‌లో హోస్ట్‌గా చేసింది. యాంకరింగ్ రంగంలో సుమ కనకాల తరువాత స్థానాన్ని అనసూయ దక్కించుకుంది. అనసూయ తన గ్లామరస్ అందాలను ఆరబోస్తూ, ముచ్చటైన మాటలతో ప్రేక్షకులను కట్టిపారేస్తుంది. ఇక రంగస్థలం, పుష్ప లాంటి సూపర్ హిట్ సినిమాలలో కీలక పాత్రలో నటించింది అనసూయ.