బాలయ్య కు బిగ్ సర్ ప్రైజ్..అన్ స్టాపబుల్ షో లో బాలకృష్ణ జాన్ జిగిడి దోస్త్..!!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న‌ అన్ స్టాపబుల్ షో రేంజ్ రోజురోజుకు మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా కొనసాగుతుంది. ఈ షోలో పాల్గొనటానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ షో తో బాలకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది. టాలీవుడ్ హీరోల అభిమానులు మాత్రం బాలకృష్ణ షోలో తమ అభిమాన హీరో వస్తే మాత్రం ఆ ఎపిసోడ్ ను ఎగబడి చూసేందుకు రెడీ అవుతున్నారు.

AHA's talk show “Unstoppable with NBK” breaks new records

న్యూ ఇయర్ కానుకగా ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్ రాక‌తో ఏకంగా ఆహా యాప్ షేక్ అయిపోయే విధంగా అభిమానులు ఎగబడి మరీ చూశారు. రాబోయే రోజుల్లో మరి కొంతమంది అగ్ర హీరోలు వస్తారని కూడా తెలుస్తుంది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ రేంజ్ మరో లెవల్ కు వెళ్ళింది. ఇక మరో రెండు రోజుల్లో ప్రభాస్ ఎపిసోడ్ కు కొనసాగింపుగా రెండో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

వీటితోపాటు టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా ఈ ఎపిసోడ్ ను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ ఈ మధ్యలో బాలయ్య వీర సింహారెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా అదే రోజున ఈ చిత్ర యూనిట్‌కు సంబంధించిన ఎపిసోడ్ ను తీసుకురావాలని ఆహా డిసైడ్ అయిందట. దానికి సంబంధించిన షెడ్యూల్ ని కూడా తాజాగా నిన్న‌ విడుదల చేసింది.

Kamal Haasan for Unstoppable When?

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సంక్రాంతి తర్వాతే వచ్చే అవకాశం ఉంది. అయితే వీర సింహారెడ్డి ఎపిసోడ్‌లో ఈ చిత్ర యూనిట్ తో పాటు లోకనాయకుడు కమలహాసన్ కూడా బాలయ్యతో సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటించింది. ఇక ఇప్పుడూ బాలయ్య అన్ స్టాపబుల్ షో కి తన తండ్రి కమలహాసన్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. బాలకృష్ణ కూడా కమలహాసన్‌తో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.

Veera Simha Reddy Release Date, Star Cast, Trailer, Plot & More - JanBharat  Times

 

గతంలో వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించాలని కూడా ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే మళ్లీ ఇన్ని సంవత్సరాలు తర్వాత కమలహాసన్ తెలుగులో కూడా విక్రమ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తెలుగులో కూడా మరింత హైప్ తెచ్చుకునేందుకు బాల‌కృష్ణ షోలో అడుగు పెట్టబోతున్నాడని కూడా తెలిసింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.