శ్రీ‌జ‌కు ఖ‌రీదైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చిన చిరు.. దాని విలువ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

మెగాస్టార్ చిరంజీవికి రామ్ చరణ్ తో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. చిన్న కూతురు పేరే శ్రీజ. ఈమె తన భర్త, యంగ్‌ హీరో కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇవ్వబోతోందని గత కొద్దిరోజుల నుంచి ఓ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. శ్రీజ మొదట భరద్వాజ్‌ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతడితో విడిపోయింది.

ఆ తర్వాత శ్రీజకు చిరంజీవి కళ్యాణ్ దేవ్ తో వివాహం జరిపించారు. అయితే ఇప్పుడు వీరి మధ్య సైతం మనస్పర్ధలు తలెత్తాయని.. విడాకులు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సంగతి పక్కన పెడితే తాజాగా చిరంజీవి శ్రీజ‌కు ఖరీదైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చారట. ప్రస్తుత ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఇంటి ఖరీదు తెలిస్తే కళ్ళు తేలేస్తారు. ఎందుకంటే.. శ్రీజకు గిఫ్ట్ గా ఇచ్చిన ఆ ఇంటి విలువ రూ. 35 కోట్లు ఉంటుందట. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఈ ఇంటిని కొనుగోలు చేశారట. అన్ని సౌకర్యాలతో ఎంతో విలాసంగా ఈ ఇల్లు ఉంటుందట. ఇక తాను చేసిన మ‌రియు చేయబోతున్న సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ తో చిరంజీవి ఈ ఇంటిని కొన్నారని అంటున్నారు. మరి ఇంత సడన్ గా చిరు తన చిన్న కూతురుకు గిఫ్ట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్నది తెలియాల్సి ఉంది.