తాడిప‌త్రిలో డిఫెన్స్‌లో టీడీపీ.. పెద్దారెడ్డిలో ఈ ధీమా ఎందుకు ?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రి. దీనికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కుప్పం ఎలా అయితే.. ప‌ట్టం క‌ట్టిందో.. ఇక్క‌డ జేసీ బ్ర‌ద‌ర్స్‌కు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం 35 ఏళ్ల‌పాటు ప‌ట్టం క‌ట్టింది. వ‌రుస విజ‌యాల‌తో తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌త్య‌ర్థి ఎవ‌ర‌నేది సంబంధం లేకుండా.. జేసీ బ్ర‌ద‌ర్స్ ఇక్క‌డ విజ‌యం ద‌క్కిం చుకున్నారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో 2019లో వైసీపీ అభ్య‌ర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డివిజ‌యం సాధించారు. ఇంత‌వ‌ర‌కు బాగానేఉంది.

JC-Brothers | తెలుగు360

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా త‌న‌దే విజ‌య‌మ‌ని.. ఆయ‌న అప్పుడే బోర్డులు పెట్టించేస్తున్నారు. ఇదీ..ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2019లో జ‌గ‌న్ పాద‌యాత్ర‌, వైసీపీ ప్ర‌భంజ‌నం.. వంటి వాటిలో కొట్టుకొచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇలానే తాడిప‌త్రిలోనూ వైసీపీ విజ‌యంద‌క్కించుకుంద‌ని అంద‌రూఅనుకున్నారు.. అయితే..పెద్దారెడ్డి మాత్రం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వైసీపీని ఇక్క‌డ గెలిపించి.. సీఎం జ‌గ‌న్‌కు గిఫ్ట్‌గా ఇస్తానంటూ.. తాజాగా స‌వాల్ చేశారు. దీనికి ప్ర‌ధానం గా ఆయ‌న చెబుతున్న రీజ‌న్‌.. జేసీ బ్ర‌ద‌ర్స్ పని అయిపోయింద‌నే!!

ఈ నినాదాన్ని పెద్ద ఎత్తున పెద్దారెడ్డి అనుచ‌రులు ప్ర‌చారం చేస్తున్నారు. జేసీ బ్ర‌ద‌ర్స్ ప‌ని అయిపోయింద‌ని.. ఇక‌, నియోజ‌క‌వ ర్గంలో త‌న‌కు తిరుగులేద‌ని ఆయ‌న అంటున్నారు. మ‌రోవైపు.. జేసీ వ‌ర్గం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. అయితే.. గ‌త ఏడాది ముందున్న ప‌రిస్థితి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. గ‌తంలో యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చేవారు. అయితే.. ఇప్పుడు యువ‌త‌ను అడ్డుకోవ‌డంలో పెద్దారెడ్డి వ‌ర్గం స‌క్సెస్ అయింది. ఇక‌, కార్య‌క్ర‌మాల‌కు కూడా పోలీసులు అనుమ‌తించ‌డం లేదు. దీంతో స‌హ‌జంగానే జేసీ వ‌ర్గం వెనుక బ‌డింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

భార్యపై అనుచిత పోస్టులు: జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి -తాడిపత్రిలో భయానక యుద్ధం | high tension at tadipatri: ysrcp mla pedda reddy allegedly attacks ...

ఇదిలావుంటే.. ప్ర‌జ‌ల నాడి విష‌యానికి వ‌స్తే.. వైసీపీ ఇస్తున్న సంక్షేమం అంద‌రికీ అందుతోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే వ‌ర్గానికి ఇది ప్ల‌స్‌గామారింది. అంతేకాదు.. ఎమ్మెల్యే అనుచ‌రులే నేరుగా వ‌లంటీర్లుగా ఉండ‌డంతో ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిస్థాయిలో వైసీపీ ప‌ట్టు పెంచుకుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడువైసీపీ ఉన్న పొజిష‌న్‌తో పోల్చుకుంటే.. టీడీపీ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింద‌న‌డంలో సందేహం లేదు. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏదైనా మార్పు చోటు చేసుకుంటుందేమో చూడాలి.