మంచు మనోజ్ రెండో పెళ్లి ట్విట్ వైరల్..!!

గడిచిన కొంతకాలంగా హీరో మంజు మనోజ్-భూమా మౌనికల పెళ్లి వివాహం వైరల్ గా మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజున మంచు మనోజ్ చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారుతోంది. లైఫ్ లో నెక్స్ట్ పేజీలోకి అడుగు పెట్టబోతున్నానంటూ తన ట్విట్ చేయడం జరుగుతోంది .చాలా రోజులుగా తన మనసులో దాచుకుంటూ వస్తున్న ఒక స్పెషల్ న్యూస్ ని జనవరి 20వ తేదీన అందరితో పంచుకోబోతున్నానంటూ ఈ ట్వీట్ లో తెలియజేయడం జరుగుతోంది. మంచు మనోజ్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Some Rare and Unknown Facts about Bhuma Mounika Reddy - Hyd7am.com
దీంతో కొంతమంది మంచు మనోజ్ రెండో పెళ్లి ఉద్దేశించి ఇలాంటివి చేసినట్లుగా తెలియజేస్తున్నారు. అయితే కొన్ని మీడియా సంస్థల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి వివాహం ముహూర్తం ఖరారు అయినట్లుగా సమాచారం. రీసెంట్గా మంచు మనోజ్ కడప దర్గాలో దర్శించుకున్నప్పుడు ఫిబ్రవరి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు. ఇక అదే సమయంలో తన కొత్త సినిమాలు గురించి కూడా తెలియజేయడం జరిగింది. భూమా మౌనిక మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు మనొజ్ చెప్పినట్లుగానే ఫిబ్రవరి నెలలో వీరిద్దరి ముహూర్తం ఖరారు అన్నట్లుగా సమాచారం.మంచు మనోజ్ ,మౌనికకు ఇది రెండవ వివాహం. ఇద్దరు వ్యక్తిగత కారణాల చేత మొదట వివాహ బంధానికి దూరమయ్యారు. గత కొంతకాలంగా మంచు మనోజ్ మౌనిక చెన్నైలో ఉన్నట్లుగా సమాచారం. ఇక మంచు కుటుంబంలో సినిమాల విషయానికి వస్తే.. కొంతకాలంగా ఎప్పుడూ ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. చివరిగా మోహన్ బాబు తీసిన సన్నాఫ్ ఇండియా సినిమా ఘోరమైన ఫ్లాప్ ని ఎదుర్కొంది అలాగే మంచు విష్ణు జిన్నా సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు.

https://twitter.com/HeroManoj1/status/1615564635905875969?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1615564635905875969%7Ctwgr%5E42fe61796ead7ffcdbb8d9b602838287d1fc4489%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fstatic.asianetnews.com%2Ftwitter-iframe%2Fshow.html%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FHeroManoj1%2Fstatus%2F1615564635905875969%3Fref_src%3Dtwsrc5Etfw