10రోజులు పాటు నీళ్లలోనే తడిచిన చిరు.. డెడికేషన్ అంటే అట్ల ఉంటది మరి..!

ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వం వహించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ ‘ ఈ సినిమాని నేను ఎడిటింగ్ రూమ్ లో దాదాపు రెండుమూడు వందల సార్లు చూసాను కానీ ఏ సీన్ ని కూడా మళ్ళీ ఎడిట్ చేయాలని అనిపించలేదు. దాంతో వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నాకు అర్థం అయింది’ అని బాబీ వివరించారు.

“ఈ సినిమా బాక్సఫీస్ వద్ద రికార్డులు సృష్టించబోతుందని అని అనుకున్నాను. కానీ ప్రేక్షకులు నేను అనుకున్నదానికంటే ఎక్కువగానే ఆదరించారు. వాల్తేరు వీరయ్య సినిమా ఇంట్రడక్షన్ ని సముద్రం నేపథ్యంలో చిత్రికరించాల్సి వచ్చింది. ఆ సీన్ నేను అనుకున్న విధంగా రావడానికి చిరు గారు దాదాపు 10 రోజులవరకు నీళ్లలో తడిచారు. అంతేకాకుండా చిరంజీవి అందరితో చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఎవరయితే కష్టపడతారో వారిని ఆయన ఇష్టపడతారు అనే విషయం నాకు అర్థమయింది ‘ అని బాబీ వివరించారు.

ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈ వయసులోనూ చిరంజీవి తన సినిమాల కోసం చూపిస్తున్న డెడికేషన్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఊరికే మెగాస్టార్లు అయిపోరు, వారి డెడికేషన్ అంటే అట్ల ఉంటది మరి అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. జనవరి 13వ తేదీన రూ. 140 కోట్ల బడ్జెట్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.170 కోట్ల వరకు వసూలు చేసి కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ కి, శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ పొందాయి.