పవన్ చిత్రాల విషయంలో తప్పు జరుగుతోందా..?

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఎంత ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి ,జల్సా, ఖుషి లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా కథ విని ఆ సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ముందుగానే ఊహించగలరని తెలుస్తోంది.. అలా అంచనా వేసిన సినిమాలే నిర్మాతలకు కళ్ళు చెదిరే లాభాలను అందిస్తూ ఉంటాయి.

Buzz: Pawan Kalyan to be the chief guest for Vijay's Vaarasudu pre-release  event

ఈనెల 26న బద్రి రీ రిలీజ్ కానుందని సమాచారం. అయితే బద్రి సినిమాను రీ రిలీజ్ చేయడం విషయంలో ఫ్యాన్స్ ఏమాత్రం హ్యాపీగా లేరు. కొన్ని వారాల గ్యాప్ లోనే పవన్ సినిమాలు రీ రిలీజ్ కావటం వల్ల కలెక్షన్ల పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఖుషి సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు రావడం వల్ల బద్రి సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే తన సినిమాల రీ రిలీజ్ విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ తెలియజేస్తున్నారు. అయితే నెలకో సినిమా చొప్పున విడుదల చేస్తే సినిమాలను థియేటర్లో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Pawan Kalyan Renu Desai | Pawan Kalyan Badri 15 Years Renu Desai | Renu  Desai About Pawan Kalyan | Renu Desai About Badri | Pawan Kalyan News | -  Filmibeat

మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే .. ప్రస్తుతం హర హర వీరమల్ల మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయితే కొత్త సినిమాలుకు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ ఉంది. ఈ ఏడాదిలో సమ్మర్ కి ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తాంది..పవన్ చాలా గ్యాప్ తీసుకొని హర హర వీరమల్ల సినిమాను చేస్తున్నారు. కాబట్టి ఆయన అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. తెలిసి తెలిసి సినిమాల విషయంలో పవన్ తప్పు చేస్తున్నారా అని వార్తలు వినిపిస్తున్నాయి.