బాబుతో తారక్ భేటీ..తమ్ముళ్ళు సృష్టించారా?నిజమేనా?

ఇటీవల రాజకీయాల్లో పార్టీలు చేసే రాజకీయం ఒకోసారి నిజమో తెలియట్లేదు..లేక అబద్దమో తెలియట్లేదు. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేస్తూ రాజకీయం చేస్తున్నాయి. దీంతో నిజమో ఏదో, అబద్దమో ఏదో క్లారిటీ లేకుండా పోయింది. ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అవుతున్నారనే వార్తలో నిజమెంత ఉందో క్లారిటీ లేదు.

ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు అమెరికా టూర్‌లో తారక్..హైదరాబాద్‌కు రాగానే చంద్రబాబుని కలుస్తారని ప్రచారం జరుగుతుంది. జనవరి 10న చంద్రబాబుతో తారక్ భేటీ అవుతారని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ భేటీ ఎందుకు? ఏంటి? అనేది క్లారిటీ లేదు. అసలు ఈ భేటీ నిజమో కాదో తెలియని పరిస్తితి. ఇప్పటికే తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఏపీలో పలు ఘటనలపై ఆచి తూచి అడుగులేస్తున్నారు. భువనేశ్వరిని దూషించిన విషయంలో కావచ్చు..విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంపై చాలా జాగ్రత్తగా స్పందించారు.

అయితే కర్రా విరగకూడదు..పాము చావుకూడదు అన్నట్లు తారక్ స్పందించారని, దాని కంటే స్పందించకుండా ఉంటే బాగుండేది అని కొందరు టీడీపీ శ్రేణులు రియాక్ట్ అయ్యారు. పైగా ఎన్టీఆర్‌ని చంద్రబాబు తోక్కేస్తున్నారని, రాజకీయాల్లో తన కొడుకు లోకేష్‌ని ముందుకుతీసుకెళ్లాలని అలా చేస్తున్నారని కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు అంటున్నారు.

అంటే దాదాపు ఎన్టీఆర్..టీడీపీకి దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో చందబాబు, ఎన్టీఆర్‌ని కలుస్తున్నారనే వార్తలు రావడం సరికొత్త చర్చకు దారితీసాయి. మరి ఈ వార్తల్లో నిజముందో కొన్ని రోజుల్లో తెలుస్తోంది.