కార్తికేయ-2తో హిట్టు కొట్టాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఘోరం..?

 

ప్రస్తుతం ఏ సినిమా అయిన కేవలం ఒక భాషలో హిట్ అవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. హిందీ, ఇతర భాషలో కూడా హిట్ కొడితేనే ఏ సినిమాకైనా పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ దక్కుతుంది. ఇక ఆ సినిమా హిట్ రేంజ్ ని బట్టి హీరోకి అవకాశలు రావడం, ఆ హీరో మార్కెట్ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కేజీఎఫ్ హీరో యష్, ఆర్ఆర్ఆర్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు కూడా ఇలాంటి స్టార్‌డమ్‌నే దక్కించుకున్నారు. అలా అని అందరికి ఇలాంటి అదృష్టం కలిసి రాకపొవచ్చు కూడా.

ఇలా పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా హిట్ అయిన కూడా లక్కు కలిసి రాని హీరోల లిస్ట్‌లో నిఖిల్ ఒకరు. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. కృష్ణ తత్వానికి థ్రిల్లర్ కాన్సెప్ట్ ని యాడ్ చేసి తీసిన ఈ సినిమాకి హిందీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాతో నిఖిల్‌కి పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు వచ్చింది. అయితే కార్తికేయ 2 సినిమా ప్రభావం మాత్రం తాజాగా నిఖిల్ నటించిన 18 పేజీస్ మీద చూపించకపోవడం అనేది ఆశ్చర్యం. టాలీవుడ్‌లో రంగస్థలం, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న సుకుమార్ దీనికి డైరెక్షన్ అందించాడు.

గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్, అనుపమ పరమేశ్వరన్ తో నిఖిల్ జోడి కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. కానీ ఏది వర్కౌట్ కాకా ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. దీనిబట్టి అర్థమైన విషయం ఏంటంటే కార్తికేయ 2 సినిమా క్రెడిట్ మొత్తం కంటెంట్‌కే దక్కుతుంది. ఈ సినిమా వల్ల నిఖిల్‌కి కలిగే లాభం తక్కువే. నిజానికి కార్తికేయ 2 నిఖిల్ కి ప్లస్ అయ్యి ఉంటే ఆ ప్రభావం 18 పేజీస్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. అలా ఈ హీరో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చినట్లు చాలామంది కామెంట్లు చేస్తున్నారు.