రెండో పెళ్లిపై ప్ర‌శ్న‌.. మ్యాచ్ అయ్యేవాడు దొరకాలి క‌దా అంటూ ప్ర‌గ‌తి ఓపెన్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ న‌టి ప్ర‌గ‌తి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వంద‌ల సినిమాల్లో న‌టించింది. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ప్రగతి చాలా యాక్టివ్ గా ఉంటుంది. త‌ర‌చూ వ‌ర్కౌట్ వీడియోలు, డ్యాన్స్ వీడియోల‌తో సోష‌ల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తుంటుంది.

అయితే తాజాగా ప్ర‌గ‌తి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే రెండో పెళ్లిపై ప్ర‌శ్నించ‌గా.. ప్ర‌గ‌తి చేసిన కామెంట్స్ ఇప్పుడు మాట్ టాపిక్ గా మారాయి. ప్రగతి ప్రస్తుతం సింగిల్ మదర్. ఆమె చాలా కాలం క్రితమే భర్తతో విడిపోయింది. అయితే తాజా ఇంట‌ర్వ్యూలో `భ‌ర్త‌తో విడుపోయాక మ‌ళ్లీ ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల‌ని అనిపించిందా?` అంటూ యాంక‌ర్ ప్ర‌శ్నించింది.

అందుకు ప్ర‌గ‌తి.. `పెళ్లి అనడం కంటే తోడు అనుకోవచ్చు. ఒక్కోసారి తోడు కావాలి అనిపిస్తుంది. అయితే నా మెచ్యూరిటీకి మ్యాచ్ అయ్యే వ్యక్తి దొరకాలి క‌దా అనిస్తుంది. కొన్ని విష‌యాల్లో నేను చాలా ఖ‌చ్చితంగా ఉంటాను. 20 ఏళ్ల వయసులో ఉంటే అడ్జస్ట్ అయ్యేదాన్నేమో కానీ.. ఇప్పుడు కష్టం` అంటూ చెప్పుకొచ్చింది. ఈ వయసులో పెళ్లి చేసుకొని అడ్జస్ట్ అయి బ్రతకడం త‌న వ‌ల్ల కాద‌ని ప్ర‌గ‌తి చెప్ప‌క‌నే చెప్పేసింది. ఇక తాను లైఫ్ లో తీసుకున్న అతి పెద్ద పొర‌పాటు ఎర్లీ మ్యారేజ్ అని, త‌ప్పు తెలుసుకుని దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని కూడా ప్ర‌గ‌తి తెలిపింది.