పవన్- బాలకృష్ణ అన్ స్టాపబుల్ నుంచి క్రేజీ అప్డేట్..!!

ఇన్ని రోజులు వెండితెర పైన అలరించిన బాలకృష్ణ ఆహా ఓటీటి లోకి అడుగుపెట్టినప్పటి నుంచి హోస్ట్ గా మారి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నారు. తనదైన సరదా మాటలతో ,కామెడీ పంచలతో హోస్ట్ గా తనలో ఉండే సరికొత్తదనాన్ని బయటపెట్టారు బాలయ్య. మొదటి సీజన్ సూపర్ హిట్ కాగ ఇప్పుడు రెండవ సీజన్ బ్లాక్ బాస్టర్ గా కొనసాగుతోంది. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులతో బాలయ్య చేసే ఇంటర్వ్యూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇందులో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ,విశ్వక్ సేన్ , ప్రభాస్, గోపీచంద్ శర్వానంద్ ,అడవి శేషు, సిద్దు జొన్నలగడ్డ ,తదితరులు రావడం జరిగింది.

These are the questions that Balayya will ask Pawan Kalyan..!
ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు మరొక ఎపిసోడ్ కోసం ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ ఎపిసోడ్ ఎవరిదో కాదు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అని చెప్పవచ్చు. ఇప్పటికే పవన్, బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఎపిసోడ్ గ్లింప్స్ ప్రోమో కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు సంక్రాంతి కానుకగా మేకర్స్ ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది.

ఈ వీడియోలో వీరిద్దరి గురించి ఇంట్రెస్టింగ్ మోషన్ పోస్టర్తో ఒక వీడియోను డిజైన్ చేయడం జరిగింది. పవర్ స్టార్ మేనియా ఎలా ఉండబోతోంది మీ ఊహకే వదిలేస్తున్నాం పవర్ స్ట్రోమ్ లోడింగ్ సూన్ అంటూ పవన్ ఎపిసోడ్ స్పెషల్ వీడియో షేర్ చేయడం జరిగిందిఆహా సంస్థ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.