వెంకటేష్ తో కలిసి నటించిన ఈ చైల్డ్ యాక్టర్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఆ తర్వాత హీరోలుగా మారిన వారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, కమలహాసన్ , తనిష్ ,వైష్ణవ తేజ్, తరుణ్ ఇలా చాలామందే ఉన్నారని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉండగా వెంకటేష్ హీరోగా నటించిన సూర్యవంశం సినిమా ప్రతి ఒక్కరికి గుర్తుండొచ్చు అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు పొందారు ఆనంద్ వర్ధన్. ఈ నటుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నటుడు ఆనంద్ వర్ధన్ నంది అవార్డు కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. పలు చిత్రాలలో నటించి చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తన కెరియర్లో చైల్డ్ యాక్టర్ గా మావిడాకులు, మనసంతా నువ్వే, బాల రామాయణ ప్రేయసిరావే ,తిరుమల తిరుపతి వెంకటేష్, తదితర చిత్రాలలో నటించారు. 1996లో సినీ ఇండస్ట్రీ లోకి బాల నటుడుగా అడుగుపెట్టిన ఇతను సుమారుగా 10 కి పైగా చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గా నటించారు. 2004లో వచ్చిన నేనున్నాను సినిమా ద్వారా మళ్ళీ కనిపించలేదు.

What did you remember about this child artist in Sooryavansham? - Quora
ఇక తర్వాత కొన్ని సంవత్సరాలకు 2012లో తన ఇంజనీరింగ్ ను పూర్తి చేసుకున్న ఆనంద్ ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్, డాన్స్ శిక్షణ తీసుకొని ప్రస్తుతం పలు చిత్రాలలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆనంద్ కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా హీరో లుక్ లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసిన ఇతడు త్వరలోనే మళ్లీ ఇండస్ట్రీలోకి హీరోగా ఇవ్వబోతున్నట్లు సమాచారం