అలాంటి తప్పుల వల్లే అక్కినేని హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా..?

టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న కుటుంబాలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. ఎంతోమంది హీరోలు ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలిపోయారు. గత సంవత్సరం బంగార్రాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగచైతన్య ఆ తర్వాత థాంక్యూ, లాల్ సింగ్ చడ్డ వంటి సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. ఇక నాగార్జున కూడా ది గోస్ట్ మూవీతో ఘోరమైన ఫ్లాప్ గా నిలిచారు. అఖిల్ చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఒక సక్సెస్ను మాత్రం అందుకున్నారు.

Nagarjuna, Naga Chaitanya: History of divorces and separations in the Akkineni  Family | The Times of India
ఇక అంతకుముందు విడుదలైన చిత్రాలన్నీ కూడా అఖిల్ కు డిజాస్టర్లు గాని మిగిలాయి. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు. నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తుండడంతోపాటు వెంకట్ ప్రభు డైరెక్షన్లో కస్టడీ సినిమాలో కూడా నటిస్తున్నారు. నాగచైతన్య కథల విషయంలో మరింత జాగ్రత్త పడాల్సి ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తెలుగులో ఎంతోమంది హీరోలకు ఇప్పటికే పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.. కానీ నాగచైతన్య మాత్రం ఇంకా అంతటి స్థాయికి ఎదగలేక పోతున్నారు.

అఖిల్ కూడా ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా రొటీన్ కథలకు కాలం చెల్లిపోయిన నేపథ్యంలో సినిమాల ఎంపిక కథ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక నాగార్జున కూడా ఎప్పుడు ఒకేలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. సినిమా కథల ఎంపిక విషయంలో అక్కినేని కుటుంబం పలు జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు.