KGF -3 సినిమా మొదలయ్యేది అప్పుడే..!!

కన్నడ సినీ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన చిత్రాలలో KGF, KGF -2 సినిమాలు కూడా ఒకటి. ఈ సినిమా రావడం వల్ల కనడ మార్కెట్ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ పాన్ ఇండియాలోనే విడుదలవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించారు. అప్పటివరకు హీరో యశ్ తెలియని వారికి కూడా ఈ సినిమాతో నేషనల్ వైడుగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక తన తదుపరి సినిమాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది.

KGF 3 Announcement : Yash Fans Spot KGF 3 Hint in KGF 2, Say Picture Abhi  Baaki Hai - Twitter Review

యష్ మాత్రం తన తదుపరి చిత్రం కేజిఎఫ్ సినిమాకి తగ్గట్టుగానే ఉండాలని ప్రణాళికను ఏర్పరుస్తూ ఉన్నారు. ఇక కే జి ఎఫ్-3 సినిమా అంతకుమించి ఉండాలి అనేలా డైరెక్టర్ డిసైడ్ అయినట్లుగా సమాచారం. నిర్మాతలు కేజిఎఫ్-3 సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ప్రభాస్ తో కలిసి సలార్ సినిమా అని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

This Is What Prashanth Neel Had Said Regarding KGF Chapter 3 - MetroSaga

ఈ ప్రభాస్ తో రెండు సినిమాలు ఎన్టీఆర్ తో ఒక సినిమా అయిపోయిన వెంటనే KGF -3 సినిమా ఉండబోతుందని సమాచారం.కేజిఎఫ్-3 ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంపై నిర్మాతలు స్పందిస్తూ.. 2025 వరకు డైరెక్టర్ ప్రశాంత్ అనిల్ పక్కా ప్రణాళికతో సినిమాలను మొదలుపెట్టారు. అని ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఈసారి రాబోయే సినిమా ఊహకందని వివరణతో రాబోతోంది అంటూ తెలియజేసినట్లు సమాచారం.