ఏదో అనుకుంటే ఇంకా ఏదో అయిందన్నట్లు..మూడు రాజధానుల్లో భాగంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే నినాదంతో వైసీపీ రాజకీయ లబ్ది పొందాలని చూసింది. మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో రాజకీయంగా బెనిఫిట్ కొట్టేయాలని చూసింది. కానీ దీని వల్ల సీన్ రివర్స్ అయిపోయింది. ఇటు కోస్తాలో ఎలాగో నష్టపోయేలా ఉంది.
ఉత్తరాంధ్రలో అనుకున్న మేర లాభం మాత్రం రాలేదని క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ విషయం తెలుసుకునే ఇటీవల మూడు రాజధానుల ఉద్యమం అంటూ వైసీపీ మరో పోలిటికల్ గేమ్ మొదలుపెట్టింది. ఇప్పటికే విశాఖ గర్జన పేరుతో ర్యాలీ చేసింది. అయినా సరే అక్కడి ప్రజలు వైసీపీని నమ్మే పరిస్తితి కనిపించడం లేదు. ఇప్పటికే ఎన్నికలు దగ్గరపడిపోతున్నాయి. ఇప్పటికీ రాష్ట్రానికి ఓ రాజధాని అంటూ క్లారిటీ లేకుండా చేశారు. ఇప్పుడు మూడు రాజధానుల ఉద్యమం అంటున్న ఉత్తరాంధ్ర జనం నమ్మినట్లు కనిపించడం లేదు.
ఆ విషయం ఇటీవల వైసీపీ నిర్వహించిన అంతర్గత సర్వేల్లోనే తేలిందట. గత ఎన్నికల్లో మూడు జిల్లాల్లో ఉన్న 34 సీట్లలో కలిపి 28 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఈ సారి 25 సీట్లు అయిన గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. కానీ ఆ టార్గెట్ రీచ్ అయ్యేలా కనిపించడం లేదు. విశాఖలోనే వైసీపీకి పెద్ద డ్యామేజ్ జరిగేలా ఉంది. జిల్లాలో 15 సీట్లు ఉంటే..ఓ 5 సీట్లలోనే వైసీపీకి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. మెజారిటీ సీట్లలో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది. ఇక టీడీపీకి జనసేన కలిస్తే వైసీపీకి రిస్క్.
అటు విజయనగరంలో కూడా వైసీపీకి అనుకున్నంత పాజిటివ్ లేదు. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది..ఈ సారి 9 సీట్లలో 5 గెలుచుకున్న గొప్పే. శ్రీకాకుళంలో 10 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 8 వైసీపీ గెలుచుకుంది. ఈ సారి 4 గెలిస్తే ఎక్కువే. అంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి యాంటీ బాగా కనిపిస్తోంది.