బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె జబర్దస్త్ లో యాంకరింగ్ తో పాటు తన అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ప్రస్తుతం జబర్దస్త్ తర్వాత ఛానల్ తో సంబంధం లేకుండా ప్రతి షోకి కూడా యాంకర్ గా వ్యవహరించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఒకవైపు బుల్లితెరపై పలు షోలు చేస్తూనే మరొకవైపు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంది.
టీవీ షోలలో ఎంతో గ్లామరస్ గా కనిపించే అనసూయ సినిమాలను మాత్రం చాలా విభిన్నమైన పాత్రలు చేస్తూ మరింత పాపులారిటీని పొందింది. ఇలా వరుసగా టీవీ షోలు సినిమాలు చేస్తూ పోయే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీని దక్కించుకున్న అనసూయ సినిమాల మీద మోజుతో జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోయింది. అంతేకాదు కొన్ని సందర్భాలలో అనసూయ జబర్దస్త్ గురించి బాగానే చెప్పినప్పటికీ చివర్లో తనపై కొంతమంది అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి జబర్దస్త్ నుంచి తప్పుకుంది.
అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది. చిట్ చాట్ లో భాగంగా షోలలో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు తప్పకుండా త్వరలోనే స్మాల్ స్క్రీన్ మీద రీ ఎంట్రీ ఇస్తాను.. జబర్దస్త్ ను కూడా చాలా మిస్ అవుతున్నాను.. త్వరలోనే జబర్దస్త్ పై అడుగుపెడతాను అని కూడా ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.