ప్రకాశం వైసీపీలో యువ డాక్టర్ రాజకీయం..సీటు కోసమే..!

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ జగన్ సీటు ఇస్తారా? అంటే అది ఏ మాత్రం జరగని పని చెప్పవచ్చు. ఖచ్చితంగా వ్యతిరేకత ఎక్కువ ఉన్నవారిని పక్కన పెట్టడం గ్యారెంటీ..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే జగన్ ఆ మేరకు ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. సరిగ్గా పనిచేయకపోతే సీటు ఇవ్వనని చెప్పేశారు. ఇదే క్రమంలో కొందరు ఆశావాహులు సీటు పై ఆశలు పెట్టుకుంటున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొందరు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఓ యువ డాక్టర్ వైసీపీలో సీటు కోసం ట్రై చేస్తున్నారట.  జిల్లాకు చెందిన డాక్టర్ జీవన్ చిటితోటి.. ఆర్థోపెడిక్ వైద్యుడిగా సుపరిచితుడు. డాక్టర్‌గా మంచిపేరు తెచ్చుకున్నారు. ఈ మధ్య ఆయన రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఈయనకు వైసీపీ నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి.

May be an image of 9 people, beard, people standing and indoor

ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో.. ఇటీవల ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు బాలినేని శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ఇక బాలినేని ద్వారా నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కోసం కూడా ట్రై చేస్తున్నారట. అలాగే బాలినేనితో పాటు జిల్లాకు కొందరు సీనియర్ నేతలు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ నుంచి ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది మాత్రం క్లారిటీ లేదు.

అయితే ప్రకాశం జిల్లాలో మొత్తం 12 సీట్లు ఉన్నాయి. అందులో 8 సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ కూడా వైసీపీలోకి వచ్చారు. మరి 9 సీట్లలో ఏ సీటు డాక్టర్‌కు ఇస్తారో క్లారిటీ లేదు. కానీ 9 మంది సిట్టింగులకు సీటు ఇవ్వడం జరగని పని. మరి డాక్టర్ కోసం ఏ సీటు రిజర్వ్ చేస్తారో చూడాలి.