టాలీవుడ్ హీరోలపై ఫన్నీ కామెంట్స్ చేసిన నయనతార..!!

కోలీవుడ్ , టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది నయనతార. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నయనతార నటిస్తూ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాష లలో అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నది నయనతార. అయితే ఇటీవల పలు సినిమాలలో పలు విభిన్నమైన పాత్రలో నటిస్తూ ఉన్నది. నయనతార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తున్నా తన హవా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నది.

Connect star Nayanthara got THIS to say about Jr NTR and Prabhas. Find out  - India Today

ఈ ఏడాది తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకున్నది నయనతార. ఇటీవల సరోగసి ద్వారా పిల్లలను కూడా కన్నది. వివాహం తర్వాత నయనతార కెరియర్ మరింత స్పీడ్ పెంచేసింది. చేతినిండా వరుస సినిమాలతో చాలా బిజీగా గడిపేస్తోంది. ఇక రీసెంట్ గా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా నటించింది. ఇప్పుడు తన భర్త నిర్మిస్తున్న ఒక హర్రర్ చిత్రం కనెక్ట్ లో హీరోయిన్గా నటించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తెలుగు ఆడియన్స్ కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది నయనతార.

ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోల పై మాట్లాడుతూ ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్ పై ఫన్నీ కామెంట్స్ చేసింది. ప్రభాస్ తో యోగి చిత్రంలో నటించింది. అయితే అప్పటికి ఇప్పటికీ ప్రభాస్ ఏం మారలేదని ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని తెలియజేస్తోంది. ప్రభాస్ అల్లరి తట్టుకోవడం చాలా కష్టమని తెలుపుతోంది. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదగడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ కూడా చాలా సెట్స్ లో చాలా హుందాగా జాలీగా కనిపిస్తూ ఉంటారని తెలిపింది. ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టమని.. ఎటువంటి రిహార్సల్ లేకుండా షూట్ కు వెళ్లడం ఎన్టీఆర్ గొప్పతనం అని తెలిపారు. ఇక రవితేజ గురించి మాట్లాడుతూ రవితో ఎప్పుడు హిందీలో మాట్లాడుతూ ఉంటానని తెలిపింది. బాలకృష్ణతో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఫీలింగ్ అని తెలుపుతోంది.