యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాలయ్య “సుగుణ సుందరి”..సెన్సేషనల్ రికార్డ్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు గోపీచంద్ మాలినేని తెరకెక్కిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలయ్య అఖండ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన థ‌మన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

The Second Single 'Suguna Sundari' From Balakrishna's 'Veera Simha Reddy Will Be Out On This Date…

వచ్చే సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది వీర సింహారెడ్టి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా యూనిట్ కూడా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్లు కూడా ఎంతో స్పీడ్ గా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి విడుదలైన “సుగుణ సుందరి” పాటకు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

ఇప్పటికే ఈ పాటకు యూట్యూబ్‌లో 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. బాల‌య్య‌కు ఇదే మొదటిసారి కావడంతో అయ‌న ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై మరింత ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో క‌న్న‌డ స్టార్ హీరో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. సంక్రాంతి వంటి సీజన్ లో రసవత్తరమైన పోటీ మధ్య బాలయ్య సినిమా ఎలా ఆకట్టుకుంటుందో తెలియ‌లంటే వేచి ఉండాల్సిందే.