భారీ సినిమాలపై ఎడతెగని ఉత్కంఠ.. ఎప్పుడు విడుదల అవుతాయంటే?

సినిమా పరిశ్రమలో భారీ సినిమాలు ప్రకటించిన నాటినుండి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రేక్షకులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తూ వుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద బేనర్లలో వచ్చే సినిమాలు వారిని అలరిస్తాయని వారు నమ్ముతారు. ఇక ఆయా సినిమా హీరోల అభిమానులైతే సదరు మూవీలపై భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటూ వుంటారు. ఈ క్రమంలో అలా అభిమానుల అంచనాలను పెంచేలా వున్న మొదటి సినిమా ‘పుష్ప 2’. ‘పుష్ప’ సినిమా అనూహ్య విజయం సాధించడంతో ఈమూవీ సీక్వెల్ పై భారీ అంచనాలు ఇపుడు నెలకొన్నాయి.

అవును, ఈ సీక్వెల్ స్క్రిప్ట్ ను అంచనాలకు మించి ఉండేలా సుకుమార్ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడని ఆమధ్య వార్తలు లీక్ అయ్యాయనే విషయం తెలిసినదే. కాగా ఈ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అభిమానులు అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందో లేదో అని కంగారు పడుతున్నారు. ఇక ఈ లిస్టులో 2వ స్థానంలో వున్న సినిమా ప్రభాస్ – నాగ్ అశ్విన్ భారీ మూవీ. ఈమూవీ కథలో ఫ్యాంటసీ ఎలిమెంట్ ఎక్కువగా ఉండే పరిస్థితులలో గ్రాఫిక్స్ వర్క్స్ కోసం చాల సమయం పడుతుంది టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో ఈమూవీ కూడ 2024 లోనే విడుదల అవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి.

ఈ లిస్టులో 3వ స్థానంలో ఉన్న సినిమా కాంబినేషన్ కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ ల ప్రాజెక్ట్. ఈ సినిమా అనౌన్స్ అయితే జరిగింది కానీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అంటున్నారు. ఇక తొందరగా వస్తుందనుకుంటున్న ఈ మూవీ విడుదల కూడ 2024 లోనే ఉండే అవకాశం ఉంది అని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక అదే విధంగా రామ్ చరణ్ – శంకర్ ల భారీ ప్రాజెక్ట్ మూవీ షూటింగ్ 40 శాతం పూర్తికాగా మిగిలిన 60% షూటింగ్ కాస్త జాప్యం జరుగుతోంది. దాంతో ఈమూవీ కూడ 2024 సంక్రాంతికే విడుదల అని వార్తలు వస్తున్నాయి. ఇలా టాప్ హీరోల భారీ సినిమాలు బాగా ఆలస్యం కావడంతో ఓ వైపు అభిమానులకు, మరోవైపు ఇండస్ట్రీ వర్గాలలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.