మహేష్ కెరియర్ లో ఎప్పుడూ చెయ్యని సాహసం.. త్రివిక్రమ్ కోసం సంచలన నిర్ణయం..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28 వ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా మహేష్ బాబు ఇంట్లో జరిగిన విషాదాలు కారణంగా షూటింగ్ ఆగిపోయింది. అప్పటినుంచి ఈ సినిమా షూటింగ్ అదుగో ఇదిగో అంటూ వెనకడుగు వేస్తూ ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ దశగా వెళుతోంది.

ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చిన ఈ సినిమాకు త్వరలోనే షూటింగ్ కు వెళ్ళబోతోంది.. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి సినిమాలో నటించాల్సి ఉంది. అందుకే ఈ సినిమాను చాలా అంటే చాలా స్పీడ్ గా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌ను జనవరి సెకండ్ వీక్ ఆరంభంలో మొదలుపెట్టి మార్చి నెలాఖరు వరకు లాంగ్ షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Mahesh Babu and Trivikram Srinivas's film goes on floors with puja,  shooting begins in April - India Today

సంక్రాంతి తర్వాత నుండి మార్చి చివరి వారం వరుకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ బ్రేక్ లేకుండా సాగబోతుందట..సుమారుగా 80 రోజుల కాల్ షీట్స్ ని ఈ సినిమా కోసం మహేష్ బాబు నాన్ స్టాప్ గా కేటాయించాడట..ఈ 80 రోజుల లాంగ్ షెడ్యూల్ తో 60 శాతం షూటింగ్ పూర్తి అవుతుంది..ఈ సినిమా లో హీరోయిన్స్ గా పూజ హెగ్డే మరియు శ్రీ లీలా ఖరారు అయ్యారు..థమన్ సంగీతం అందిస్తున్నాడు..ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు, రాజమౌళి సినిమాకి షిఫ్ట్ అవుతాడు.