టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. అందులో తక్కువ మంది మాత్రమే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఒకో సంవత్సరం ఒక్కో హీరోయిన్ హవా కనిపిస్తూ ఉంటుంది. మరి ఏడాదిలో రష్మిక, సమంత ,పూజా హెగ్డే మృణాల్ ఠాగూర్ తదితర హీరోయిన్లు మాత్రమే సందడి చేయడం జరిగింది. మిగిలిన హీరోయిన్స్ సైతం కేవలం ఒకటి రెండు సినిమాల నటించి పెద్దగా ఆకట్టుకోలేక పోయారు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ ఏడాది కీర్తి సురేష్ సర్కార్ వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాగానే ఆకట్టుకుంది అయితే ఆ తర్వాత తన సినిమాలు ఏవి విడుదల చేయలేదు. రష్మిక ,పూజా హెగ్డే మాత్రం స్టార్ హీరోల సినిమాలలో కనిపిస్తూ ఉన్నారు వీరిద్దరితోపాటు హీరోయిన్ మృణాల ఠాగూర్ మరొక ఆప్షన్ గా మారుతోంది. బడనిర్మాణ సంస్థలలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు సమంతనే ఎంపిక చేసుకుంటూ ఉంటున్నారు. ప్రస్తుతం ఈ నలుగురే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. వచ్చేయేడాది ఈ జాబితాలో పలువురు మారే అవకాశం కూడా ఉన్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ నలుగురు ముద్దుగుమ్మలు టాప్ స్టార్ ఎవరని విషయంపై సమాధానం చెప్పడం చాలా కష్టమని చెప్పవచ్చు. అయితే ఇండస్ట్రీ వర్గాలు మరియు మీడియా సర్కిల్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం పారితోషకం పరంగా చూసుకుంటే ఒకరు.. సక్సెస్ పరంగా చూసుకుంటే మరొకరు అన్నట్లుగా టాప్ ప్లేస్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నలుగురు హీరోయిన్స్‌లో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ మరియు హిందీ భాషలలో కూడా వర్షన్ సినిమాలు చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
సమంత కూడా లేడీ సినిమాలలో నటిస్తు బాగానే సక్సెస్ అయ్యింది. అలాగే మృణాల్ ఠాగూర్ కూడా వరుసగా సినిమాలు చేయాలని తెలుగు ఫిలిం మేకర్స్ కోరుకుంటున్నారు.అలాగే రష్మిక, పూజ హెగ్డేలలో కూడా ప్రస్తుతం బాలీవుడ్లో తెలుగులో కూడా పలు చిత్రాలు నటిస్తూ ఉండడం చేత టాప్ హీరోయిన్ పర్టికులర్‌గా ఇమే అని చెప్పడానికి లేదని తెలుస్తోంది.