విష్ణు విశాల్ హీరోగా ,చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఫ్యామిలీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం మట్టి కుస్తీ. ఈ చిత్రాన్ని నిర్మాతగా రవితేజ నిర్మిస్తూ ఉన్నారు ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఈ చిత్రం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పలు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం కోవిడ్ కి ముందు మట్టి కుస్తీ సినిమా కథను విన్నాను.. నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్ తో కూడినది.ఈ పాత్రకు న్యాయం చేయలేనేమో అని చాలా భయపడ్డాను..ఇదే విషయం కూడా డైరెక్టర్‌కు చెప్పానని తెలియజేసింది. అలా అంతా ఓకే అనుకున్న సమయంలో కోవిడ్ వచ్చింది దాదాపుగా మూడేళ్ల తర్వాత స్క్రిప్ట్ మళ్లీ తన దగ్గరికి వచ్చిందని ఈ గ్యాప్ లో పలు సినిమాలు చేశానని దానివల్ల కాన్ఫిడెంట్ బాగా పెరిగిందని తెలియజేసింది ఐశ్వర్య లక్ష్మి. తెలుగులో సినిమాలు చూస్తాను అందరూ ఇష్టమే నటీనటులు అందరూ కూడా ప్రేక్షకులను వినోదం అందించడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారని తెలియజేసింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి ,సత్యదేవులతో బాగా పరిచయం ఉందని తెలియజేసింది ఐశ్వర్య లక్ష్మి. మాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ కూడా తెలుగు, తమిళ్ భాషలో చిత్రాల చేస్తూ బాగానే గుర్తింపు సంపాదించుకుంది. గార్గి చిత్రంతో కూడా నిర్మాతగా మారిందట. అలాగే ఇటీవలే అమ్ము చిత్రంతోపాటు పొన్నియన్ సెల్వన్ చిత్రంలో పూంగిళి అనే పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మీకు ప్రేమ వివాహం ఇష్టమా? పెద్దలు నిశ్చయించిన పెళ్లి ఇష్టమా? అనే ప్రశ్న ఎదురుగా అందుకు సమాధానంగా అసలు పెళ్లంటే ఇష్టం లేదని టక్కున సమాధానం చెప్పింది దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.