మొత్తానికి చంద్రబాబుకు ఆదరణ పెరిగినట్లు కనిపిస్తోంది…కొంతకాలం నుంచి బాబు పర్యటనలకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు..ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన జిల్లాలకు వస్తుంటే మళ్ళీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు పర్యటనలకు జనం నుంచి మంచి స్పందన వస్తుంది.
సాధారణంగానే అధినేత వస్తున్నారంటే నేతలు తమ పార్టీ శ్రేణులని తరలిస్తారు. అయితే పార్టీ శ్రేణులే కాదు..అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా బాబు రోడ్ షోల్లో ఉంటున్నారు. దీంతో రోడ్లు అన్నీ కిక్కిరిసి పోతున్నాయి. వెస్ట్‌లో బాబు టూర్..దెందులూరు నుంచి మొదలై..చింతలపూడి, పోలవరం, కొవ్వూరు, గోపాలాపురం నియోజకవర్గాల్లో సాగింది. అలాగే తాడేపల్లిగూడెం, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది.
అయితే బాబు వెళ్ళిన ప్రతినియోజకవర్గంలోనూ భారీగానే ప్రజల నుంచి స్పందన వచ్చింది. ఈ పరిస్తితిని బట్టి చూస్తే ఆయా స్థానాల్లో టీడీపీకి కొత్త ఊపిరి వచ్చినట్లే అని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో ఒక్కటి కూడా టీడీపీ గెలవలేదు. ఇప్పుడు ప్రజల స్పందన చూస్తుంటే ఆ స్థానాల్లో టీడీపీకి గెలుపు అవకాశాలు మెరుగు పడ్డాయని చెప్పవచ్చు. వాటిల్లో దెందులూరు స్థానంలో పార్టీ మరింత బలపడింది. అయితే చింతలపూడి, కొవ్వూరు, పోలవరం, గోపాలాపురం స్థానాల్లో పార్టీకి ఊపు కనిపిస్తోంది.
కాకపోతే ఇంకా ఆ స్థానాల్లో సరైన నాయకులు లేరు. గోపాలాపురంలోనే వెంకట్రాజుని ఇంచార్జ్ గా పెట్టారు. మిగిలిన మూడు స్థానాల్లో ఇంచార్జ్‌లు ఎవరో క్లారిటీ లేదు. ఆ సీట్ల కోసం టీడీపీలో పోటీ ఉంది. ఈ పరిస్తితులని చూసుకుని బాబు నేతలకు సర్దిచెప్పి..బలమైన నాయకులకు బాధ్యతలు ఇస్తే..ఆ మూడు స్థానాల్లో కూడా టీడీపీకి గెలుపు అవకాశాలు పెరుగుతాయి. ఏదేమైనా వెస్ట్‌లో టీడీపీకి ఊపు వచ్చిందని చెప్పవచ్చు.