మైత్రి మూవీ కి తలనొప్పిగా మారుతున్న పుష్ప చిత్రం..!!

ఈమధ్య ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను విడుదల చేసి బాగానే సక్సెస్ అవుతున్నారు. గడచిన కొన్ని నెలలుగా భారతీయ సినిమాలు బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని వందల కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన కొన్ని సినిమాలకు ప్రమోషన్ ఖర్చులు కూడా తిరిగి రాకపోవడంతో నిర్మాతలు రిలీజ్ అంటే చాలా భయపడుతూ ఉన్నారు. అలా ఏడాది కేజీఎఫ్ -2,RRR, కార్తికేయ-2, కాంతారా వంటి సినిమాలు పాన్ ఇండియా వయసులో విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేశాయి.

Pics: Pushpa 2 Begins With Poojaఇక పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసిన పుష్ప చిత్రం మైత్రి మూవీస్ కు పెద్ద తలనొప్పిగా మారుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలంటే కాస్త కంగారు పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. కారణం భారీ స్థాయిలో కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుంది అంతేకాకుండా ఆ మొత్తం రిటర్న్ అవుతుందని గ్యారెంటీ కూడా కనిపించడం లేదట. రీసెంట్గా రష్యాలో విడుదల చేసిన ఈ సినిమాకి రూ.3కోట్ల రూపాయలకు మించి ఖర్చు అయ్యిందని అయితే ఈ సినిమా అక్కడ ఎలాంటి ప్రభావం చూపలేకపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో ఈ సినిమా అక్కడ రూ .3 కోట్లను కూడా రాబట్ట లేకపోవడంతో మైత్రి మూవీ వారు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా రిలీజ్ చేయాలని ఒత్తిడి మొదలైన విడుదల చేయడం పెద్ద తలనొప్పిగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.