చిరు, బాల‌య్య‌లో ఉన్న కామన్ పాయింట్ అదే అంటున్న శేఖర్ మాస్టర్!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తుంటే.. చిరంజీవి బాబీ డైరెక్షన్ లో `వాల్తేరు వీరయ్య` చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ నే హీరోయిన్ గా నటించింది.

అలాగే వీర సింహారెడ్డి జనవరి 12న విడుదల కాబోతుంటే.. వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే రెండు చిత్రాల నుంచి పోటా పోటీగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇకపోతే వాల్తేరు వీర‌య్య‌ సినిమాలో అన్ని పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. వీర సింహారెడ్డిలో రెండు పాటలకు ఆయ‌న ప‌ని చేశారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శేఖ‌ర్ మాస్ట‌ర్‌.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాలను పంచుకున్నారు.

 

ఈ క్ర‌మంలోనే చిరు, బాల‌య్య‌లో ఉన్న కామ‌న్ పాయింట్‌ను కూడా వివ‌రించారు. `చిరంజీవి, బాలకృష్ణ టాప్ హీరోలు, ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. ఈ ఇద్దరిలో వున్న యూనిక్ క్యాలిటీ డెడికేషన్. ఒక మూమెంట్ వస్తే అది పూర్తయ్యేవరకూ రిలాక్స్ అవ్వరు. ఆ డెడికేషన్ ఇద్దరిలో చూశా. అలాగే టైమింగ్ సెన్స్. వారిద్దరి దగ్గర నుండి నేర్చుకోవాల్సిన మ‌రో విష‌యం` అంటూ శేఖ‌ర్ మాస్ట‌ర్ చెప్పుకొచ్చారు ఇక ఈ రెండు చిత్రాలు సంక్రాంతికే విడుదలవుతాయని ముందు తెలియద‌ని.. కానీ ఇప్పుడు ఒక్కో లిరికల్‌ సాంగ్‌ విడుదలవుతుంటే టెన్షన్‌ మొదలైంద‌ని శేఖ‌ర్ మాస్ట‌ర్ తెలిపారు.