ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి..కేసీఆర్ కర్తవ్యం ఏంటి?

తెలంగాణలో గత మూడు నెలలుగా ఎమ్మెల్యేల కొనుగోలులో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి వంద కోట్లు చొప్పున 400 కోట్లు  ఎర చూపిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుని ఎమ్మెల్యేలు, పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి..ముగ్గురు వ్యక్తులని పట్టుకున్నారు. సిహాయాజులు, నందకుమార్,  రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మలు ఈ కేసులు నిందితులుగా ఉన్నారు. ఆడియో, వీడియో టేప్‌లతో పక్కా ప్రణాళికతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నిందితులకు రిమాండ్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు |  Manalokam

అయితే కొన్ని రోజుల తర్వాత వారికి బెయిల్ కూడా వచ్చింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం అధీనంలో ఉన్న సిట్ విచారణ చేస్తూ వస్తుంది. కానీ సిట్ పై తమకు నమ్మకం లేదని, ఈ కేసుని సి‌బి‌ఐకి ఇవ్వాలని ముగ్గురు నిందితులు కోర్టులో పిటిషన్ వేశారు. కావాలని చెప్పి ఆధారాలని మీడియాలో వచ్చేలా చేశారని, ఇందులో కుట్ర కోణం ఉందని చెప్పుకొచ్చారు.

ఇక నిందితుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు..తాజాగా కేసుని సిట్ నుంచి సి‌బి‌ఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పుపై ఆర్డర్‌ కాపీ వచ్చే వరకు తీర్పు అమలు నిలిపివేశారు. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేయడానికి కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతుంది. అయితే ఆర్డర్ కాపీ వచ్చాక పిటిషన్ వేస్తారా? లేక ఈ లోపే పిటిషన్ వేస్తారా? అనేది చూడాలి.

అయితే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సి‌బి‌ఐ చేతుల్లోకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వెళ్లనుండటంతో..కేసీఆర్‌కు పెద్ద షాక్ తగిలినట్లు అయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో కుట్ర కోణం ఏమన్నా బయటపడితే..ఆ నలుగురు ఎమ్మెల్యేలకు రిస్క్ ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి చివరికి ఈ కేసులో ఎలాంటి ముగింపు వస్తుందో.