ఏంటో ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు అరుదైన వ్యాధులకు గురవుతున్నారు . రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైనట్లు ఆమె చెప్పుకొచ్చింది. గత కొంతకాలం నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. అంతే కాదు ప్రస్తుతం సమంత మయో సైటీస్ ధార్డ్ స్టేజ్లో బాధపడుతుంది.
కాగా ఇన్నాళ్లు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన సమంత రూట్ మార్చి ఆయుర్వేదిక్ పద్ధతిని ఫాలో అవుతుందట . ఈ క్రమంలోనే మయోసైటీస్ వ్యాధిపై ఆయుర్వేదిక్ పద్ధతి చాలా మంచిగా పని చేస్తుందని ..ఆమె త్వరలోనే సినిమా షూటింగ్ లో పాల్గొనే అంత యాక్టీవ్ గా మారిపోయిందని తెలుస్తుంది. ఇలాంటి టైంలోనే ఇండస్ట్రీలో మరి కొంతమంది ప్రముఖులు అరుదైన వ్యాధితో బాధపడుతున్న న్యూస్ లో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఇప్పటికే పలువురు బడా స్టార్స్ అరుదైన వ్యాధులు బయటపడగా.. రీసెంట్గా టాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న జబ్బు బయటపడింది . తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పూనం కౌర్ ఫైబ్రో మయాల్దియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది . దీనిపై అఫీషియల్ గా పూనమ్ కౌర్ స్పందించినప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫిక్స్డ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఈ క్రమంలోనే ఆమె వ్యాధి మరింత ముదిరిపోవడంతో కేరళలో చికిత్స తీసుకుంటున్నట్లు ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది.
కాగా ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో మాయాజాలం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైనా స్టైల్ లో నటించి మెప్పించింది. అయితే ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కొట్టలేదు. చేసిన సినిమాలకన్నా కాంట్రవర్షీయల్ కామెంట్స్ తోనే బాగా పాపులారిటీ సంపాదించుకున్న పూనమ్.. టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిందని.. ఆ మ్యాటర్ ఎక్కడికో వెళ్లిందని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి . అయితే పూనమ్ ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు..!!