సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం “విడాకులు “. రీజన్ ఏంటో తెలియదు కానీ బిగ్ బిగ్ స్టార్స్ అందరు విడాకులు తీసుకుని విడివిడిగా బతకడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విడాకులు తీసుకున్న హీరో హీరోయిన్ల లిస్టు ఎక్కువైపోయింది . ప్రేమించి అన్ని నాళ్లు కూదా కాపురం చేయకుండా పెళ్లయిన కొద్ది కాలానికే విడాకులు తీసుకొని అభిమానులకు బిగ్ షాక్ ఇస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత-నాగచైతన్య, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇలా ఎంతోమంది జంటలు విడాకులు తీసుకొని సింగిల్‌గా జీవిస్తున్నారు. కాగా ఇప్పుడు అదే రూట్లోకి యాడ్ అయింది మరి స్టార్ జంట. అమెరికన్ స్టార్ సెలబ్రెటీస్ గా పేరు సంపాదించుకున్న కిమ్ కర్ధాషియాన్, కాన్యే వేస్ట్ విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అంత త్వరగా విడాకులు తీసుకోరని వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారని అభిమానులు చెప్పుకొచ్చారు.
అయితే ప్రముఖ యూఎస్ ఎంటర్టైన్మెంట్ మీడియా హౌస్ “పేజ్ సిక్స్” వీళ్లు విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది. ఇప్పటికే కోర్ట్ వీళ్ళకి విడాకులు మంజూరు చేసినట్లు సదరు మీడియా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది . అంతేకాదు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తమ పిల్లల్ని సమానంగా పంచుకుంది. వీళ్ళిద్దరికీ నలుగురి పిల్లలు దీంతో కిమ్ కర్దషియాన్ దగ్గర ఇద్దరు పిల్లలు..కానే వేస్ట్ దగ్గర ఇద్దరు పిల్లలు ఉండేలా కోర్ట్ తీర్పించిందట. అంతేకాదు పిల్లల చదువుల ఖర్చు ..అలాగే సెక్యూరిటీ ఖర్చులల్లో సగానికి అతడు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏది ఏమైనా సరే ఇంతటి స్టార్ సెలబ్రిటీస్ జంట విడాకులు తీసుకోవడం బాధాకరం అంటున్నారు ఫ్యాన్స్.