జబర్దస్త్ లో ఎంతమంది కమెడియన్స్ వున్నా చమ్మక్ చంద్రది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవాలి. తనదైన కామెడీ టైమింగ్ తో ఆహుతులను అలరించిన చమ్మక్ చంద్ర అంటే చాలా మందికి మక్కువ ఎక్కువ. మొదట చంద్ర అత్త, భార్య రోల్స్ వేస్తూ సూపర్ పాపులర్ అయ్యాడు. సాధారణంగా లేడీ పాత్రలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తరువాత వారి టీమ్ లోకి శ్రీసత్య అడుగు పెట్టింది. శ్రీసత్య కూడా మీకు బాగా తెలుసు కదా. జబర్దస్త్ లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న లేడీ కమెడియన్లో ఆమె ఒకరని చెప్పుకోవాలి.
అప్పటి వరకు లేడీ గెటప్స్ వేసి విసిగిపోయిన చమ్మక్ చంద్రకి శ్రీ సత్య మంచి ఉపశమనం కలిగించిందనే చెప్పుకోవాలి. ఈమె రాకతో చంద్ర టీంలో ప్రత్యేకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అంతవరకూ భార్యల పాత్రలు పోషించిన చంద్రకి ఆ తరువాత భర్తల రోల్స్ చేయడం మొదలు పెట్టాడు. వీరిద్దరూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించేవారు. చమ్మక్ చంద్ర స్కిట్స్ దాదాపు అన్నీ ఫ్యామిలీ డ్రామాలే. మొగుడు పెళ్ళాల గిల్లికజ్జాల మీద అతగాడు స్కిట్స్ చేసేవాడు. తన స్కిట్స్ లోని లేడీ క్యారెక్టర్స్ కోసం సత్యను తెచ్చుకున్నాడు. దాంతో ఆమె సూపర్ గా సక్సెస్ అయ్యారు.
అయితే కొన్ని కారణాలవలన వారిద్దరూ ఒకరి తరువాత ఒకరు జబర్దస్త్ ని వీడిన సంగతి అందరికీ తెలిసినదే. నాటినుండి నేటివరకు ఆమె ఆ షోలో కనిపించిన దాఖలాలు లేవు. తాజాగా ఆమె సడన్ గా జబర్దస్త్ లో ప్రత్యక్షమయ్యారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో తాగుబోతు రమేష్ టీమ్ లో సత్య ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె రీఎంట్రీ ఇచ్చారని అందరూ అనుకుంటున్నారు. ఇక సత్య రీఎంట్రీకి కారణం ఏమిటనే ఊహాగానాలు ఇపుడు మొదలయ్యాయి. చమ్మక్ చంద్రతో విబేధాలు కారణంగానే మరలా జబర్దస్త్ కి వచ్చారనే రూమర్స్ వస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా ఓ క్లారిటీ రావాల్సి వుంది.