సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే సరిపోదు ..ఆ పేరుని పది కాలాలపాటు స్టార్ హీరోయిన్ లిస్టులో అలాగే ఉండనివ్వాలి . హీరోయిన్స్ అంటే అందంతో పాటు బుర్రని కొంచెం వాడాలి ..ఎంతసేపు గ్లామర్ ఫోటోషూట్ చేసే అవకాశాలు సంపాదించుకోవాలి అంటే కుదరదు ..అలా వచ్చిన అవకాశాలని ఎలాగైనా సరే మన ఖాతా నుండి బయట వాళ్లకి వెళ్లనీకుండా జాగ్రత్తపడాలి . అప్పుడే మనల్ని ఇండస్ట్రీలో గౌరవిస్తారు ..మనకంటూ ఒక గౌరవం ఉంటుంది .
అయితే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ తో సినిమా ను రిజెక్ట్ చేసి తప్పు చేసింది యంగ్ బ్యూటి. తప్పు చేసిన సంవత్సరాలకి అయ్యాయో తప్పు చేశానని బాధపడుతుందట. మనకు తెలిసిందే సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డి గ్లామరస్ లుక్ లో కనిపించి మెప్పించాడు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించడమే కాకుండా.. బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది . ఈ సినిమాల్లో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్నా కెరియర్ ఎలా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
పుష్ప సినిమా ముందు పుష్ప సినిమా తర్వాత అనంతల మారిపోయింది. రష్మిక మందన్నా కెరియర్. కాగా ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా అనుకునింది బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. పుష్ప సినిమాలో మొదట హీరోయిన్ గా అనుకునింది స్టార్ డాటర్ జాన్వీ కపూర్ అని.. కానీ స్క్రిప్ట్ విన్న బోనీకపూర్ జాన్వి కపూర్ ఎంట్రీ తోనే డీ గ్లామరస్ లుక్ తో అభిమానులను మెప్పించలేదని ..అందుకే ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ తప్పుకుందని తెలుస్తుంది.
ఏది ఏమైనా సరే బన్నీ పక్కన కత్తిలాంటి జాన్వికపూర్ నటించి ఉంటే మాత్రం ఈ సినిమా మరింత రేంజ్ లో సక్సెస్ అందుకునేది అంటున్నారు జనాలు . అందం అనేది ఎలా ఉన్నా ఒకటే డి గ్లామరస్ లుక్ అయితే జాన్వీ లో నటించే సత్తా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇలా సిల్లీ రీజన్ తో బోనీకపూర్ జాన్వి కపూర్ ఖాతాలో నుంచి మంచి అవకాశాన్ని మిస్ చేశాడు అంటూ చెప్పుకొస్తున్నారు.