టాలీవుడ్ స్మార్ట్ ఫెలో మహేష్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో వరుస సూపర్ హిట్లతో అందరికంటే ముందంజలో వున్నాడు. లాస్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపొతే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్‌తో చేస్తున్నాడనే విషయం తెలిసినదే కదా. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ షూటింగ్ లో పాల్గొంటున్నాడని సమాచారం. ఇకపోతే మహేష్ బాబు సినిమాల పరంగానే కాకుండా వ్యాపార పరంగా కూడా మంచి స్పీడుమీద వున్నాడని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా రెస్టారెంట్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మన సూపర్ స్టార్. ఏషియన్ గ్రూప్‌తో కలిసి హైదరాబాదులో తాజాగా రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌కు AN అని నామకరణం చేశారు. A అంటే ఏషియన్స్ అండ్ N అంటే నమ్రత. ఈ కొత్త రెస్టారెంట్ బంజారా హిల్స్‌లోని TRS భవనం పక్కన కలదు. ఇక ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా నిర్వహించగా దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
కొన్నేళ్ల క్రితం ఏషియన్ గ్రూప్‌తో కలిసి గచ్చిబౌలిలో ఓ మాల్ ఏర్పాటు చేసిన సంగతి కూడా మీకు తెలుసు కదా. కాగా ఇపుడు తాజాగా రెస్టారెంట్ ఏర్పాటు చేయడం విశేషం. ఇక మహేష్‌బాబు సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న SSMB28పై చాలా అంచనాలు వున్నాయి. త్రివిక్రమ్ – మహేష్ బాబుకి ఇది మూడవ సినిమా కాబట్టి ఘట్టమనేని అభిమానులు ఈ సినిమాపైనే గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, పూజాతో పాటు మరో హీరోయిన్‌కు అవకాశం ఉందని తెలుస్తోంది.