ఆ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ డెసిషన్ కరెక్టేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… పరిచయం అక్కర్లేని ఓ ప్రభంజనం. ఓ వ్యక్తికి అభిమానులుంటారు, వీరాభిమానులుంటారు… కానీ ఓ వ్యక్తికి భక్తులు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా అది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కి మానిక్స్ మాత్రమే వుంటారు. పవన్ ఓ విషయం చెప్పారంటే చాలు.. ఫ్యాన్స్ దాన్ని తు.చ తప్పకుండా ఫాలో అయిపోతారు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లలో విజిల్స్ వేస్తూ, గోల చేస్తూ శివాలెత్తిపోతారు.

యూత్ లో ఆయనకున్న క్రేజ్ గురించి మాట్లాడుకోవాలంటే రోజులు సరిపోవు. అలాంటి పవన్ కల్యాణ్.. ఓ సినిమా విషయంలో ఎమన్నా తప్పుడు డెసిషన్ తీసుకున్నాడా అని ఫాన్స్ కంగారు పడుతున్నారు. విషయానికొస్తే.. హిట్ ఫ్లాప్ అనే తేడాలేకుండా తెలుగు పరిశ్రమలో ఎదిగిన ఏకైక నటుడు పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏపీలో 2019 శాసనసభ ఎన్నికల కోసం రంగంలోకి దిగుతానని చెప్పి, సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ సినిమాలు మానేస్తారేమోనని కంగారుపడ్డారు. అలాంటి పవన్.. ‘వకీల్ సాబ్’ మూవీతో రీఎంట్రీ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.

పవన్ రాజకీయంలో ఉన్నప్పటికీ మరోవైపు సినిమాలు చేస్తేనే అభిమానులు ఖుషిగా వుంటారు అనేదానికి ఇదే నిదర్శన. 2021 ఏప్రిల్ లో ‘వకీల్ సాబ్’ థియేటర్లలోకి రావడం, ఆ తరువాత ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ‘భీమ్లా నాయక్’గా రావడం వరసగా రెండు బ్లాక్ బస్టర్స్ అవ్వడం జరిగిపోయాయి. కాగా ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ మధ్య తాజాగా డైరెక్టర్ సుజీత్ తో ఓ గ్యాంగ్ స్టర్ మూవీ పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యినట్టు భోగట్టా. అయితే ఈ సినిమా విషయంలో ఫాన్స్ కాస్త అటుఇటుగా ఆలోచిస్తున్నారట. దానికి ఒక్కటే కారణం గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ సినిమాలు గతంలో పవన్ చేసి చేతులు కాల్చుకున్నాడు. మరి ఈ సినిమా ఎలా వుండబోతోంది అని ఫాన్స్ కాస్త కంగారుగ్గా ఉన్నట్టు భోగట్టా.