జెనీలియా ఈ పేరు కన్నా హ హ హాసిని అనే పేరుని ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారు జనాలు . అంతలా తన ఒరిజినల్ పేరు కన్నా సరే సినిమాలోని పాత్ర పేరుతో ఫేమస్ అయింది స్టార్ హీరోయిన్ జెనీలియా. నిజానికి జెనీలియా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టింది చాలా తక్కువ . బోలెడు సినిమాలో నటించిన జెనీలియా.. ఎక్కువ సెకండ్ హీరోయిన్ గానే కనిపించి మెప్పించింది . అంతేకాదు ట్రెడిషనల్ , మోడ్రెన్ పాత్రలు చేస్తూ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.
అయితే జెనీలియాకు మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమా ఏది అంటే మాత్రం అందరూ ముందుగా చెప్పేది “ఢీ” ఆ తర్వాత చెప్పేది “బొమ్మరిల్లు”. తెలుగు జనాలకు జెనీలియా అనే పేరు గుర్తు రాగానే ముందు హ హ హసిని అంటూనే పలకరిస్తారు. అంతలా ఆ పాత్రతో అల్లరి చిల్లరగా సరదాగా తెరపై కనిపించిన నవ్వించి మెప్పించింది . ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో కుర్రాళ్ళు అందరూ పెళ్లి చూపులు కి వెళ్లినప్పుడు.. హహ హాసిని లాంటి అమ్మాయి కావాలి అంటూ ఎక్స్పెక్ట్ చేశారు. అంతలా తన మాయ చేసేసింది .
అయితే జెనీలియా తెలుగులో సినిమాలు చేస్తున్న టైంలోనే తెలుగు స్టార్ కొడుకు ఆమెను నమ్మించి మోసం చేశాడని ఓ న్యూస్ వైరల్ గా మారింది . తనతో సినిమాలో నటించిన ఆ హీరో స్క్రిప్ట్ ఒక విధంగా చెప్పి సినిమాకు ఒప్పించాడని,, తన పాత్రను సినిమాకి ఓకే చేసే ముందు తనతో ఒకలా మాట్లాడి ఒప్పించాడని ..సినిమా చేస్తున్న టైంలో హీరో పూర్తిగా కంట్రోల్ తప్పి తన పాత్రకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ..డైరెక్టర్ కూడా తన జాన్ జిగిడి దోస్తు కావడంతో జెనీలియా పాత్రను తొక్కేసాడని.. ఈ క్రమంలోనే సినిమా ఫ్లాప్ అయిందని ఆమె బాధపడిందట.
లేకపోతే చాన్నాళ్ల తర్వాత తెలుగులో ఆమె నటించిన సినిమా ఖచ్చితంగా హిట్ అయి ఉండేదని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు జెనీలియాని మోసం చేసిన స్టార్ సన్.. ప్రజెంట్ ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయాడని ..ఆమెను ఏడిపించిన పాపమే ఇలా ఆమె ఆయనకు శాపంగా మారిందని ..జెనీలియా ఉసురు ఆ హీరోకి తగిలిందని జనాలు చెప్పుకుంటున్నారు.