తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీరసింహారెడ్డి.ఈ చిత్రానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య చెల్లెలుగా నటిస్తున్నట్లు సమాచారం. విలన్ గా దునియా విజయ్ కూడా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ ఈ సినిమాకి మంచి క్యూరియాసిటీని పెంచేసాయి. మొదటి పాటను జై బాలయ్య పాటను విడుదల చేయగా అద్భుతంగా రెస్పాన్స్ లభించింది సుగుణసుందరిని డిసెంబర్ 15న విడుదల చేయబోతున్నారు.
తాజాగా ఈ పాటను లాంచ్ చేయడానికి సమయాన్ని కూడా ఎంచుకున్నారు చిత్ర బృందం. డిసెంబర్ 15 ఉదయం 9:42 గంటలకు విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో బాలయ్య యంగ్ ఏజ్ లుక్ లో చూపించబోతున్నారు. ముఖ్యంగా శృతిహాసన్ బాలయ్య ఇద్దరు కూడా మల్టీ కలర్ డ్రెస్సులో చాలా అందంగా కనిపిస్తున్నారు. అద్భుతమైన ఆదరణ పొందిన మొదటి పాట జై బాలయ్యకు మాస్ పాట అయితే సుగుణసుందరి డ్యూయెట్ కేటగిరిలో అలరించనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఈ పాట చాలా స్పెషల్ అని కూడా తెలియజేస్తున్నారు చిత్ర బృందం. నేషనల్ అవార్డు విన్నింగ్ క్రాఫ్ట్ మ్యాన్ నవీన్ నూలి ఎడిటింగ్ ఈ చిత్రానికి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో చివరి పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చేయడానికి జనవరి 12న సంక్రాంతి బరిలో విడుదల కాబోతోంది.