రాజమౌళి ,మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన చివరి చిత్రం RRR ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.గత కొన్నేళ్లుగా భారతీయ సినీ దిగ్గజాలు మన సినిమాని ఆస్కార్ సాధించాలని కలలు కంటూ వస్తున్నారు. ఈ కలని రాజమౌళి RRR సినిమాతో నిజం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.RRR చిత్రానికి పలు అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
న్యూయార్క్ ఫిలిం క్రెడిట్ సర్కిల్ అవార్డు వేదికలో RRR చిత్రం ఉత్తమ దర్శకుడు ,ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా గోల్డెన్ గ్లోబ్ 2023 కి నామినేట్ కావడంతో చిత్ర బృందం పై ప్రతి ఒక్కరు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో SSMB -29 మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని ఇటీవల తెలియజేయడం జరిగింది. ఈ చిత్రం ఇండియా జోన్స్ తరహాలో హారి స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు ఇలాంటి సినిమాని చేయాలని రాజమౌళి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని తెలియజేశారు.
ముఖ్యంగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తెరకెక్కించబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఇక అప్పటినుంచి ఈ సినిమా పైన పలు కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా తాజాగా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో మహేష్ తండ్రి పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని ఈ పాత్రలో అమితాబచ్చన్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. హీరోయిన్గా దీపికా పదుకొనే కూడా నటించబోతున్నట్లు సమాచారం. విలన్ గా సంజయ్ దత్ నటిస్తూ ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై రాజమౌళి అసలైన క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.