పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం కారణంగా ఒప్పుకున్న సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్న సంగతి తెలిసింది. ఈయన నాలుగైదు చిత్రాలను లైన్లో పెట్టాడు. కానీ షూటింగ్స్ మాత్రం కంప్లీట్ అవ్వడం లేదు. ఇలాంటి తరుణంలో పవన్ రైటర్ గా మారుతున్నాడంటూ జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో `భవదీయుడు భగత్ సింగ్` అనే చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమాను ప్రకటించి చాలా కాలమే అయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా కథా రచనలో పవన్ భాగం అవ్వబోతున్నాడట.
పవన్ ఇలా సినిమాలకు కథ అందించడం తొలిసారి ఏమీ కాదు. గతంలో జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు పవన్ స్వయంగా కధ రాశాడు. ఆ అనుభవంతోనే హరీష్ శంకర్ కు పవన్ తన వంతు సూచనలు ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం పట్ల నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేయి.. ఆ తర్వాత రైటర్‌గా మారుదువు అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. ఈ టైమ్ లో నీకు అవసరమా అంటూ మరికొందరు ఏకేస్తున్నారు.